పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కళలను ప్రదర్శించే స్త్రీలు స్వతంత్రులుగా వుండాలి

179

 వున్నాయి. కాని యింకా వారువారు ఆ వృత్తులను యేవగించుకొన్నట్టు లేదు. లేక వారిలోఁగూడ కొందఱు యేవగించుకొని మానుకొన్న వృత్తులు కొన్ని వుంటే వున్నాయేమోగాని అవచ్ఛేదకావచ్చేదేనా ఆయావృత్తులు చేసేవారిలో యీలాటి చలనం కలిగినట్టులేదు. దేవదాసీలలోనే యీలాటి సంచలనం కలిగింది. యిందుకు యెవరుగాని అడ్డంకి చెప్పకూడదు. వారు యెంత తొందరగా నేనా ఆయావృత్తులు సర్వమూ వాట్లకు సంబంధించిన ఫలితాలతోకూడా వదులుకుంటే బాగా వుంటుంది. వీట్ల కన్నింటికీ అంగీకారం యేజాతివారికేనా అయితే ఆ జాతిలోన్నుంచి కొందఱు గాని, లేకపోతే అందఱూకాని యీ ఖాళీఅయిన చోటును ఆక్రమిస్తే ఆక్రమించవచ్చును. లేదా ఆ పోస్టు ఖాళీగానే వుంటుంది. మునిఁగిపోయిందేమిటి? ఆ విచారంతో పనిలేదుకాని ప్రపంచ చరిత్రలో యేవృత్తికాని ఖాళీపడి యెవరికోసమున్నూ నిరీక్షించిందని చెప్పుకోవడం నాకు తెలియదు. "ధాతా యథాపూర్వ మకల్పయత్" యింకా వ్రాస్తే చాలావ్రాయాలి. యింతదాఁకా వ్రాయుటకు వక తపస్విని తొదరపాటు కారణం. ఆపెకోసమైతే యింత దాఁకా వ్రాయనక్కరలేదు. ఆపె తొందరపాటు నిమిత్తమాత్రంకాని ఆయా విషయాలు యితర సోదరులకొఱకేనా యెవరో వ్రాయవలసినవే కాని, వ్రాసి సంపాదించే ప్రయోజనం మాత్రం లేదు. యెందుచేత? యిప్పుడు యిట్టి మాటలయందు యెవరికోతప్ప విలువలేదు. కొందఱు యెవరీ వ్రాసిందంటూ విచారిస్తారు. “వ్రాసినవ్యక్తి లాటీచార్టీ రుచిచూచిన వాఁడేనా? శ్రీకృష్ణ జన్మస్థానానికి యెన్నిమాట్లు వెళ్లి వున్నాఁడు?” అంటూ విమర్శిస్తారు. ఆ విమర్శనకు యేమాత్రమేనా ఆఁగితే తప్ప వాడిమాటకు “వాల్యూ” వుండదు. యిప్పుడు ముఖ్యంగా కావలసిన "క్వాలిఫికేషన్సు" అవిమాత్రమే యింతవఱకు నాకుదెలుసును. తెలిసిన్నీ నాకు తోcచినమాటలు వ్రాస్తూ వుంటాను. అవి యెవరినిగాని బాధించే తాత్పర్యంతో వ్రాసేవికావు. కాకపోయినా ప్రస్తుతం వొకతపస్వినికి బాధకంగా కనపడ్డాయి. ఆపె వేశ్యావృత్తియందు వుండేయే వాన్ని బాగా తెలుసుకొని ఆ సంఘాన్ని అభివృద్ధికిఁ దెచ్చే తలంపుతో శాయశక్తులా పాటుపడుతూ వున్నవారిలో వొకవ్యక్తి; ఆపెవుద్యమాన్ని ఆమోదించేవాళ్లలో నేను మొదటివాణ్ణి. అందులో వుండే యేవం ఆమెకు యెంత తెలుసునో అంతకన్న నాకు పదిరెట్లు యెక్కువ తెలుసును. నేను ఎందఱికో ఆవృత్తిని వదులుకోవలసిందని సలహాలుయిచ్చి వున్నాను. ఆసందర్భం గ్రంథాల్లో కొంత కనపఱచికూడా వున్నాను. అంతవఱకు ఆవిడకూడా వప్పుకుంటూనేవుంది. యిఁక మా యిద్దఱికీ అభిప్రాయభేదం యెక్కడంటే? దేవతానౌకరీభూములు తేరగా అనుభవించడం దగ్గిఱ. ఆపెకువేశ్యలలో యిప్పటికప్పుడే పూర్తిగాకాకపోయినా నూటికి తొంభై వంతులు దుర్నీతివదలుకొని సంసారిస్త్రీమార్గం అవలంబించడం జరిగిందనే నమ్మకం పూర్తిగావుంది, అలావుండడం