పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

168

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

"స్వరాజ్యం" వస్తే మాత్రం వీట్లని తట్టుకోగలదా? పాపం, యేమో. “తినబోతూ రుచులెందుకు?" హరిజనులు వ్యవసాయదారుణ్ణి యిప్పుడే పీల్చుకుతింటూన్నారు. బస్తా 1కి రు. 20–0–0 లేనా వెల వుంటేనే కాని రైతుకు విత్తనాలుకూడా మిగలనిచ్చేటట్టులేదు కూలిథోరణి. అంతా కూలీల కింద మాఱితే బాగుంటుందనిపిస్తూవుంది. కాని ఆ పద్ధతిని వ్యవసాయం చేసి గవర్నమెంటుకు పన్నెవరు చెల్లిస్తారు? మాట్లాడేటప్పటి కల్లా సమ్మె .అక్కడినుంచి కాల్పులు, పేల్పులు, యీ దేశానికి మంచి కాలమంటూ భవిష్యత్తులోవుందా? అనిపిస్తుంది. యెందుకన్నాడో నన్నయ్య భట్టారకుడు "గతకాలము మేలు వచ్చు కాలము కన్నన్" అన్నాడు – మహానుభావుడు, నిత్య సత్య వచనుడు, మత్యమరాచార్యుడు. “సత్కవి వాక్యము రిత్తవోవునే".


★ ★ ★