పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి


వారు నెల్లూరుప్రాంతంలో వున్నారు. చెన్నపురిలోనూ కనబడతారు. (1) వావిళ్లవారు, (2) చదలు వాడవారు, (3) వేదంవారు యీ మొదలైన సుప్రసిద్దులు ఆయీద్రావిళ్లే, ఆయీ శాఖకు చెందినవిద్యార్థి - వేదం వేంకటేశ్వరశాస్త్రి నావద్ద కొన్నాళ్లు చదువుకున్నాడు. చెన్నపురిలో తన బంధువులు కొందఱితో నన్ను చూడడానికి వచ్చినపుడు సయితము విభూతిధారిగానే కనపడ్డాడు గాని, బంధువులు తిరుమణి తిరుచూర్ణ ధారులుగా వున్నారు. అప్పుడు ప్రశ్నించలేదుగాని తరవాత అతణ్ణి యీవిషయమై ప్రశ్నించాను.

“యీ ప్రాంతంలో మాశాఖీయులు కొందఱు యీ విధంగా వుండడం ఆచార మన్నాడు. కీ.శే. వేదం వేంకటరాయశాస్త్రుల్లుగారు వగైరా మహామహులేకాదు, లోకైక ప్రసిద్దులు అల్లాడివారు లోనైనవారుకూడా యీ శాఖవారే అని విన్నాను.

తుని మొదలుకొని బరహంపురందాకా దెవిలిద్రావిళ్లు అనే శాఖవుంది. వీరు పేరూరిద్రావిళ్లేకాని అన్యుಲು కారు. రజస్వలా వివాహం చేయడంవల్ల స్వశాఖనుండి విడిపోవలసి వచ్చిందని వినికిడి. ఆలాటి వివాహంయొందుకు చేశారో అన్యత్ర వ్యాఖ్యానించాను.

తూర్పున - పుట్టనంబులు అంటూ గంజాం డి. ప్రాంతంలో వొక శాఖ వుందనిన్నీ వారు చెప్పకోవడం - ఆరామద్రావిళ్లుగా చెప్పుకుంటారు గాని ఆరామద్రావిళ్లు కారనిన్నీ మా శాఖీయులు తూర్పుదేశీయులు చెప్పగా విన్నాను. యెంతవఱకు సత్యమో కాని వీరు కోళ్లను పెంచుతారని యెవరో చెప్పగా విన్నాను.

వీరిలోకూడా మంచి విద్వాంసులున్నారు. వెల్నాటివారో లేక పేరూరిద్రావిళ్లో వీరికన్యను వివాహంచేసుకున్నారని విన్నాను. కాని ఆ వివాహం సంఘసంస్కర్తలకు సంబంధించింది, (పునర్వివాహం) కావడంచేత తావన్మాత్రంవల్ల ఆశాఖకీ యీ శాఖకీ బాంధవ్యం నిరాఘాటమనడానికి వీలు కాదు, కుక్కుటములూ, పిల్లులూ, కుక్కలూ యీ మూడింటి పెంపకమూ

"శ్వాన కుక్కుట మార్జాల పోషకస్యదినత్రయమ్
 ఇహ జన్మని శూద్రత్వం చండాలఃకోటిజన్మసు".

అనే ధర్మవచనాన్ని పట్టి నిషిద్ధమే అయినా, కోళ్లను పెంచడం బ్రాహ్మలకు యెక్కువ దురాచారంగా పాటిస్తున్నారు, పిల్లులు బాహాటంగా యింట్లోమనుషులతోపాటు యెంతటి శిష్టుల గృహాలైనాసరే గాలితోపాటు తిరుగుతూనే వుంటాయి. మడి గట్టుకొన్నప్పడుకూడా వాట్లను ముట్టుకోవడం దుర్వారమే. అవి పదార్థాలను ముట్టుకుంటూనే వుంటాయి.