పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

151


వుండే మీరు కూడా నేడు యీ “తదన్నంతద్రసం" లోకి రావడమూ, మాకష్టసుఖాలు తెలుసుకోవడమూ వచ్చింది కదా? అని లజ్జిస్తున్నా ననేటప్పటికి జమీందారుగారు తాము చేసినపనికి చాలా పశ్చాత్తపించి యీలాటి మహర్షులపట్ల యేలావుండాలో యెఱిగివుండిన్నీ అపచారం చేశాంగదా? అని నొచ్చుకొని, క్షమాపణచెప్పి వారి ఆశీర్వచనాన్ని పొందినట్లు చెప్పగా వినడం. యిందులో యేకొంచెమో. యిటీవలి వారికల్పనైతే కావచ్చుగాని యావత్తూ కల్పనకాదు. యీ గోపాలకిష్టమ్మగారికి పండితులతోటీ కవులతోటీ యొక్కువ పరిచయం వున్నట్టు ఆయీ స్వయంపాకగాథే కాదు, ఖలకర్ణ విషాయణం అనే ప్రబంధంకూడా సాక్ష్యమిస్తుంది. యీ పుస్తకం పేరు వినడమేకాని దీన్ని చూడలేదు. పన్నాల రామబ్రహ్మ శాస్త్రుల్లుగారు ఆయీ ప్రబంధం రచించారని మా విద్యార్థిదశలో వినికిడి. కవికర్ణ రసాయనాన్ని పట్టి యీ పేరు పుట్టి వుంటుంది. యిది గోపాలకృష్ణమ్మగారిని దూషించేదిగా వుంటుందని పేరువల్ల గోచరిస్తూవుంది. కవికీ యీయనకీ యేదో కలహకారణం కలిగి వుండాలి.

అసలు తోవలోనుంచి వ్యాసం మఱోతోవలోకి వచ్చి చాలా సేపయింది. శ్రీనాథమహాకవి “పాకనాటింటివాడవు" అన్నాడుగదా! వీరు నియ్యోగులా? వైదికులా? అని ప్రశ్నించుకుంటే, ఆ పుస్తకంలోనే- "కమలనాభామాత్య చూడామణి" అని తనతాత గారికి వేసిన అమాత్య బిరుదం సంశయాన్ని తీర్చివేస్తుంది. ఆ యీ పాకనాటివారికి ప్రాఙ్నౌటు వారనే నామాంతరం కూడా శ్రుత మవుతూ వుంది. వీరు నెల్లూరుమండలంలో కొంత విస్తరించి వున్నట్లు నావూహ. ఆఱువేల వారికంటే వీరిశాఖ చాలా తక్కువ సంఖ్య గలదే. వీరికీ వారికీ యిచ్చి పుచ్చుకోవడాలు యీనాడే కాదు, ఆ నాడూ వున్నాయను కుంటాను. కంకంటి పాపరాజుగారు “విద్యావినోదు లార్వేలవారు" అంటూ వొక సీసపద్యం చక్కనిది వ్రాసి శాఖాసౌభాగ్యాన్ని వ్యాకరించి వున్నారు. (యీ పద్యం ఉత్తర రామాయణంలో చూ.) శ్రీనాథుడు తనశాఖనుగూర్చి వ్రాస్తే బాగుండేది. కాని వ్రాసినట్టులేదు. మేమైతే “తురగవిద్యా ధురంధరత గోటలనైన దాటనేర్తురు పాకనాటివారు” అంటూ వొకసీసం రచించాంగాని ఆపాక నాటివారు (ఆయీ పద్యం శ్రీనివాసవిలాసంలో చూ.) గద్వాల, ఆత్మకూరు, ఆయీ సంస్థానాధిపతులైన రెడ్డిరాజులుగాని బ్రాహ్మణులుగారు. నా బాల్యగురువులు- వెల్నాటివారు అని వొక సీసం స్వశాఖా సౌభాగ్యాన్ని గూర్చి వ్రాసి వున్నారు. అది శ్రీకృష్ణభారతంలో వుంది. యిక్కడికి “ఆంధ్రద్రవిడ" అన్న శ్లోకంలో వున్న ఆంధ్రావాంతర భేదాలు తెలిసినంతలో వివరించినట్లయింది.

ద్రావిళ్లలో పుదూరు ద్రావిళ్లూ పుట్టగుంట ద్రావిళ్లు అనే వారిని పేర్కోలేదు, గాని తక్కినవారిని గూర్చి తెలుగుదేశంలో వుండేవారిని పేర్కొన్నట్లే, యీ పుదూరు, పుట్టగుంట