పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

153


బంగాళీల యిండ్లలో వీటికి మఱీ చనువు. వారు మత్స్య భుక్కులు గనక మత్స్యశేషాలు వారికి పనికిరానిబాపతు వీట్లకు వుపయోగపడుతూ వుంటాయి. వారు కోళ్లను పెంచుతారని వినలేదు. బంగాళీలు తమ పిల్లలతోపాటుగా పిల్లులను ప్రేమించి వాట్లకు తమసిరి ననుసరించి ఆభరణాలుకూడా అలంకరిస్తారని వినడం. కుక్కలను శిష్టులు పెంచరుగాని బాగా నాగరీకం ముదిరిన బ్రహ్మబంధువులు పెంచుతూనే వున్నారు. వీరేనా కోళ్లను పెంచరు, మొత్తం త్వరలో శూద్రత్వం సంపాదించుకోవాలంటే యీ యిండియన్ గడియారాలని పెంచడమే మంచి వుపాయం. ప్రస్తుతకాలంలో నాన్ బ్రామిన్సుతనం నౌకరీ సంపాదనకు సాధనం గనక బ్రాహ్మలు దీన్ని అవలంబిస్తే పై అధికార్లు గౌరవిస్తారేమో? బ్రాహ్మలు యెందఱో పాపం! యీ దిక్కుమాలినకులంలో యెందుకు పుట్టవలసి వచ్చిందో అని విచారించేవారున్నారు. పూర్వం దేనికి దేనికి గౌరవమో, యిప్పుడు దానికి దానికి అది లేదు. వెధవ పొట్టకోసం యెంతటి అనౌచిత్యానికైనా సరే సర్వులూ ఆలాయపడే కాలందాపరించింది. శాంతం పాపం! ప్రకృతమనుసరామః. కోళ్లను పెంచడంవల్ల బ్రాహ్మణ్యానికి వచ్చే హాని యెక్కువది అని తేలింది. శాస్త్రం కంటె కొన్ని విషయాలలో ఆచారం ప్రబలంగా కనపడుతుంది.

“తాల హింతాల ఖర్జూర నారికేళ మధుద్రుమాః
 ఏషాం ఫలాని భోజ్యాని న మద్యంతు కదాచన."

అని వొకాయన చదివి తాటిముంజలు తినడానికి అభ్యంతరం లేదన్నారు. శ్లోకం యాజ్ఞవల్క్యస్కృతిలోని దన్నారు. దేవతా నివేదనకు కొబ్బరికాయ, ఖర్జూరం, యిప్పపువ్వు, యివి వాడినట్లు తాటిపండుగాని, యీతపళ్లుగాని వాడరు. కొబ్బరికాయనీళ్లు శివునికి అభిషేకం చేస్తారు. తాగుతారు కాని కొబ్బరికల్లు నిషిద్ధమే. యీలా విచారణ చేసినకొద్దీ శాస్తానికీ, ఆచారానికీ వున్న తేడాపాడాలు కనపడతాయి. కోళ్లని పెంచడంచేత పుట్టనంబులకూ, మాఆరామద్రావిడానికీ బాంధవ్యం లేకపోయిందనే (యీకుక్కుటపోషణ కల్పితమో, యథార్ధమో విచారించాలి.) ప్రసక్తిలో యితర విషయం కొంత నడిచింది. ఆయీ నంబులుకూడా ఆంధ్రభ్రాహ్మణ జాతీయులే.

యిక శివార్చకులూ, వైఖానసులూ ఆయీ రెండుశాఖలవారూకూడా ఆంధ్రులలో అంతర్భవించే బ్రాహ్మణులే. ఒకరికి ఆగమం ప్రమాణం; వేరొకరికి ప్రత్యేకించి సూత్రములు (ఆపస్తంబాదికం కాక వుంది. దానికి కర్త-విఖనోఋషి) యీ యిరుతెగలవారూ విగ్రహారాధనకు ప్రధానులు. సగుణోపాసకులు. విష్ణువు నారాధించడమూ, తిరుమణి తిరుచూర్ణ ధారణమూ యివి రెండున్నూ శ్రీ వైష్ణవులతోపాటే వైఖానసులకి; తక్కిన