పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రాహ్మణశాఖలు

149


దిగడం శోచ్యంకాకపోదు. గాని, దానికి తగినంతకారణం లేకపోలేదు. రాజుగారు జగ్గకవిని నౌకర్లచే కొట్టించినట్లు వినికిడి. మొదట రచించినది చంద్రరేఖా విలాస మనిన్నీ వేంకటశాస్త్రిగారి యీసడింపుల వల్ల ఆ కృతికి సత్కారం జరగలేదనిన్నీ క్రమక్రమంగా ఆయీ వైషమ్యం యీ విధంగా పరిణమించిందనిన్నీ వినికి. యిందులో యేకొంతో సత్యంకాకపోదు. నేను ఆయీ రాజుగారి గ్రామం నేటికి 48 సంవత్సరాలనాడు వెళ్లి వున్నాను. రాజుగారి వంశీకులు నన్ను బాగా సత్కరించారు. మొదట రచించిన చంద్రరేఖావిలాసం యొక్కడేనా లభిస్తుందా? అని వారు ప్రశ్నించారు కూడాను. యింతకూ జగ్గకవిగారి కవితాధార చాలా ధారాళమయినదే కాని ఆయనకు నామరూపాలు కలిగించేది యే పుస్తకమూ లేదు.

(1) జగన్నాథమాహాత్మ్యం (2) సుభద్రాపరిణయం- యీ రెండూ సోమదేవ రాజీయంతో సహా మూడు అచ్చుపడ్డాయి. చాలాకాలంనాడు నేను చూచాను. యీ విలాపం ముందఱ అవి దివిటీముందు దీపాలు. "పాపకృత్యే౽పికీర్తిమ్" అన్న జాతకగ్రంథ శ్లోకానికి ఆయీ విలాపం ప్రథమోదాహరణం. కోపంమీద వ్రాసినవ్రాత కనక ఆవేశపూరితంగా నడిచింది. కొన్ని పద్యాలు చూస్తే ఆ కాలంలోకూడా, వైదిక నియోగ కక్షలు వున్నట్లు తెల్లమవుతుంది. కొంచెం యీయనకు భోగినీదండకం (పోతనామాత్యప్రణీతం) మార్గదర్శకంగా వుంటుంది గానిదానిలో ఔచిత్యం వుంది. దీనిలో అది బొత్తిగా లేదు. జగ్గకవిగారి తరవాత మళ్లా యీ శతాబ్దంలో యీలాటి ఔచిత్య దూరంగా వ్రాసేకవి కవిత్వం వుంది. అది రచనవల్లనే లోకానికి గోచరిస్తుంది కనక పేరు వివరించవలసి వుండదు. ఆ రచనకన్న జగ్గకవిది అనేక వేలరెట్లు నాణెంగావుంటుంది. యేదో ప్రసక్తాను ప్రసక్తంగా చాలాదూరం వచ్చాం. వేంకటకవిగారి స్వహస్తపాక నియమంతుదకు అగ్రహారాన్ని ముట్టకుండా చేసిందన్నది పరమార్థం. పనిలో పని శ్రీ కూచిమంచి గోపాలకృష్ణమ్మగారు యీ స్వయం పాకస్థులను యేవిధంగా సమ్మానించేవారో? దాన్నికూడా చదువరుల వినోదార్థం టూకీగా వివరించి ప్రధానగాథలోకి వస్తాను.

గోపాలకృష్ణమ్మగారు చిన్న జమీందార్లని వినికి. బహుశః కోన సీమప్రాంతం పలివెల వీరి నివాసమై వుండాలి. వేదవేత్తలు, శాస్త్రకోవిదులు,కవులు వారి దర్శనానికి రావడంలో ఆశ్చర్యం వుండదు. వీరిలో కొందఱు ఆహితాగ్నులు వుండకపోరు. వారిని ముందుగా గోపాలక్రిష్ణమ్మగారు యీ విధంగా హెచ్చరించేవారట. అయ్యా తాము మాపంక్తిని భోంచేయరు కాబోలును. స్వయంపాకానికి యేర్పాటు చేయవలసిందంటారా? అనేటప్పటికి చిత్తం అలాగే అని యీ ఆహితాగ్నులు సవినయంగా తలవూపే వారనిన్నీ తరువాత