పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమరిసత్రాలు

141


వారినిచూచి మఱికొందఱూ లింగాలు నిర్మించేటప్పటికి మొట్టమొదట ఆయన చేసిన లింగమేదో తెలియకపోవడంచేత ఆబ్రాహ్మఁడు యీ కింది శ్లోకం చెప్పినట్టు వినడం...

శ్లో. గతానుగతికో లోకో నలోకః పారమార్థికః
    గోదామహానదీతీరే నష్టం మే తామ్రభాజనమ్. ”*[1]

దీని తాత్పర్యం, “యెవఁడేనా యేపనేనాచేస్తే వాఁడు ఆపని యెందుకు చేశాఁడో ఆలోచించకుండా తానుకూడా ఆపనిని చేయడమేకాని యథార్థవిచారణ చేయడం లోకంలో కనపడదు. అందుచేత నిక్షేపంవంటి నారాగిచెంబు లేక జారీ వృథాగా పోయింది" అనిదీనికి సంబంధించిందే యింకో యితిహాసం వుంది. వక బ్రాహ్మఁడు యింటివద్ద భార్య ప్రతీరోజున్నూ పెసరపప్పే వండి తిండి పెడుతూవుంటే విసుగుపుట్టి పొరుగూరికి వెడితే ఆవూళ్లోకూడా ‘దై వాద్వా" ఆ రోజున పెసరపప్పే వండటం తటస్థించింది దేవతార్చన చేసుకొని సంచిలోకట్టి ఆపట్లాన్ని ఆ బ్రాహ్మణుఁడు వడ్డించిన ఆ విస్తరంటకు మూడు ప్రదక్షిణాలుచేసి భోజనానికి కూర్చునేటప్పటికి ఆయన పంక్తినివున్న మఱికొందఱు బ్రాహ్మలుకూడా అదేరీతిని ప్రదక్షిణాలకు ఆరంభించారఁట! అదిచూచి ఆబ్రాహ్మడు యేమండీ? మీయిళ్లల్లోకూడా ప్రతిరోజున్నూ పెసరపప్పేనా? యేమిటి? అని ప్రశ్నించేటప్పటికి ఆబ్రాహ్మలందఱూ వెలవెల పోయారఁట! ఇంకా యీవిషయమై యీలాటి కథలు మఱికొన్ని వున్నాయి. యింకోటిమాత్రం వుదహరించి యీవ్యాసాన్ని ముగిస్తాను. అప్పయ్య దీక్షితులవారు వకరోజున నదీతీరంలో సంధ్యావందనం చేసుకుంటూ వుండఁగా దైవవశాత్తూ కచ్చ జాఱిపోయిందఁట! గతా౽నుగతికులుగా వుండే మఱికొంతమంది బ్రాహ్మణులుకూడా కచ్చవూడcదీసికొని సంధ్యావందనానికి ఆరంభించారఁట! అన్నీ నిజమైనవిగా వుండవుగాని యీలాటి కథలలో యేకొన్నో నిజమైనవికూడా వుంటాయి. “మహాజనో యేన గతస్స పంథాః" అనడంచేత సామాన్యులు గొప్పవారి ఆచారాన్ని చట్టన అనుకరించడంతఱుచు అనుభూతం. అందుచేతే ఆచార్యపురుషులుగా వుండేవారు తమ వర్తనాన్ని చాలాభద్రంగా కాపాడుకుంటూ వుండాలని పెద్దలు చెపుతారు. యీవిషయము శ్రీకృష్ణభగవానులు గీతలలో వ్యాఖ్యానించే వున్నారు. మనం, ప్రస్తుతం ఆరంభించింది సోమరిసత్రాలను గుఱించి. వకదానిలోనుంచి యింకోదానిలోకిన్నీ యింకోదానిలోనుంచి మఱోదానిలోకిన్నీ ప్రసక్తిసంక్రమించింది. పూర్వకాలంలో సోమరిపోతులనుకూడా పోషించేరాజులుండేవారన్నమాట. యిప్పడు మాత్రం అన్ని రాజ్యాల్లోనూ ఈ సోమరిపోతుతనాన్ని పూర్తిగా నశింపచేయడానికి యత్నం జరుగుతూవుంది. బీదలలో యెవళ్లో కాని

  1. *యీ శ్లోకంలో "ఏలామహానదీ" అనేపాఠం నేను విన్నాను. ఏలానది మహానదికాదని “గోదా" అని దిద్దినట్లు చదువరులు గమనించాలి.