పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

పిమ్మట దాని తత్త్వాన్నికృష్ణమూర్తి తెల్పడం జరిగింది. ఆలా యథార్థం తెలిసినా మటౌకండే అయితే యింకా యేవో శషభిషలు కల్పించి వంకర త్రోవలు తొక్కేవాండేమోకాని సత్రాజిత్తులేశమూ అట్టి మార్గంలోకి దిగక పశ్చాత్తాపాన్ని పొంది యీ విధంగా పరితపించాcడు పాపం?

మ. మితభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాపవాదంబు బూ
న్చితి నీ దేహము. ... ... (తరువాయి భాగవతంలో చూ.)

క. పాపాత్ముల పాపములన్
బాపంగాC జాలునట్టి పరమాత్మునిపై
పాపము గలదని పలికిన
పాపాత్ముని పాపమునకుఁ బారముగలదే.

యింకా యీ విషయం భాగవతంలోకన్న స్కాందంలో విస్తరించివుంది. సత్రాజిత్తు పశ్చాత్తపించి కూCతురు సత్యభామను మాణిక్యంతో సహా శ్రీహరికి కానుకగా సమర్పించాడు. కాని శ్రీకృష్ణుడు శ్యమంతకాన్ని మళ్లా యిచ్చేశాcడు. యిటీవల “శతధన్వుండు" కాcబోలును ఆ యీ మణికోసం సత్రాజిత్తును వధించడం జరిగింది. ఆ సమయానికి శ్రీకృష్ణ భగవానుcడు ద్వారకలో පීඨා. సత్యభామ తన తండ్రికి జరిగిన ఫరోరాన్ని స్వయంగా హస్తినాపురంలోనున్న కృష్ణునకు తెల్పినట్టున్నూ పిమ్మట కృష్ణబలరాములు కల్పించు కున్నట్లున్నూ శతధన్వుండు పాటిపోయినట్లున్నూ వెంబడించి పట్టుకోCబోయేటప్పటికి యీ ੱਨ੦ గమనాయాసంచేత శతధన్వుండు మరణించినట్టున్నూ స్కాందంలోవుంది.

“శ్యమంతకాన్ని అక్రూరునివద్ద దాcచి శతధన్వుఁడు పాట్రిపోవడంచేత శతధన్వుని వద్ద మాణిక్యం దొరకలేదు. బలరాముడు తనకు తెలియకుండా దాన్ని తమ్ముఁడు అపహరించినట్టనుమానపడి కృష్ణుణ్ణి ద్వేషించడం వగైరా స్కాందంలోవుంది. మనం ముఖ్యంగా ఆ యీయితిహాసంవల్ల నేర్చుకోతగ్గనీతి పశ్చాత్తాపం. పొరపాటు యెంతవానికీ వస్తుంది. దాన్ని పురస్కరించుకొని యెవరిమీందేనా దోషాన్ని ఆపాదించడం జరిగితే దాని తత్త్వం తెలిసే వఱకే కాని తెలిశాక దాని సమర్ధనానికి ప్రయత్నించడంకంటె ప్రాజ్ఞలకు పశ్చాత్తాపాన్ని సూచించడం ఉత్తమ ధర్మం. దానివల్ల ఆ పాపం నశిస్తుంది. ఆత్మకు శాంతి కలుగుతుంది. ఉత్తముని హృదయం బహు కోమలంగా వుంటుంది. అట్టి హృదయం గల మహనీయుండు నిజమైన విషయంకూడా యితరుణ్ణి బాధించేదిగా తోస్తే వుదహరించడానికి జంకుతాcడు. అట్టి స్థితిలో సందిగ్గాంశాన్ని గుఱించి చెప్పనక్కఱలేదు. వున్న దోషాన్నేనా ఉత్తములు చెప్పకోడానికి జంకుతారు. దానిక్కారణం ఆలా చెప్పకోవడం