పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పశ్చాత్తాపము

123

ఆ దోషం అసలు చేసిన వ్యక్తిని వదిలి చెప్పకొనేవారికి సంక్రమిస్తుందని అభియుక్తులు చెప్పఁగా వినడం, మన ధర్మాలుచాలా “అసిధారావ్రతం" మాదిరిగా వుంటాయి. అతిథి పూజ ప్రతి గృహస్టుకూ తనకు వున్నంతలో అవశ్యాచరణీయంగా ధర్మశాస్రాలు చెపుతాయి. అసలు గృహస్టు యింట్లో వండే వంట ఆత్మార్థంగా చేయనే కూడదన్నారు.

“యతీచ బ్రహ్మచారీచ పక్వాన్న స్వామినౌ" అని వుంది అతిథి ప్రకరణంలో, యితర ఖండవాసులు దీన్ని చూచి యీ శాస్త్రకర్తకు మతి లేదని సిద్ధాంతీకరిస్తారు. యింకోవిశేషం, పగలు వచ్చిన అతిథిని అవకాశం లేకపోతే యింకోచోటికి వెళ్లవలసిందని చెప్పవచ్చును గాని రాత్రి తీరా భోజనంవేళకు వచ్చిన అతిథినో? ఆలా వెళ్లమనడానికి వల్లకాదన్నారు. అతనిపేరు "సూర్యోధుండు". అతణ్ణిలేదు పోవలసిందని ప్రత్యాఖ్యానంచేసే పక్షంలో అతఁడు నిరాశుండై వెడుతూ ఆ యీగృహస్టు ఇంతకు లోCగడ చేసుకున్న యావత్తు సుకృతాన్నీ (అణా పైసలతోసహా) తీసుకుపోతాండట. ఆ యీ సూర్యోధుణ్ణి గూర్చి యింత గౌరవించడానిక్కారణం యేదో వూరుగాని వూరునుంచి వచ్చి ఎవరో ఫలానా వారింటికెడితే అన్నం దొరుకుతుందనిచెప్పిన మాటమీఁద వారింటికెడితే వారు లేదుపొమ్మంటే ఆ చీకటిలో లేదా వెన్నెలే అనుకుందాం, ఆ అతిథి యొక్కడికి వెళ్లంగలుగుతాండు పాపం అందుచేత యింత నిక్కచ్చిగా శాసించాండు ధర్మ శాస్త్రకర్త. మనదేశం యీ అతిథి పూజలకు పెట్టుకుంది పేరు. యిప్పటికీ యెందటో వున్నారు. అజ్ఞాడ ఆదిభోట్ల అన్నయ్యగారినే (పేరు బాగా జ్ఞప్తికి లేదు) కాంబోలును యెంతో గొప్పగా చెప్పకుంటారు, డొక్కాసీతమ్మగారిని సరేసరి, యెన్నో దానాలున్నా "నాన్నోదక సమందానమ్”

సరే యిది విషయాంతరం. యీలాటి సుకృతాత్ములను పేర్కోవడంవల్లకూడా పుణ్యంవస్తుందని చెప్పినట్లే, నిజమైన పాపాత్ముల పాపాలనుగూర్చి ప్రసంగించుకోవడం కూడా పాపాన్ని సంపాదిస్తుందని మన పెద్దలు వుపేక్షిస్తారు.

“కథా@_పిఖలు పాపానామల మత్రేయసే”

అట్టి స్థితిలో యేవ్యక్తిమీంద నేనా వృథాగా "అపాండవం" కల్పించి దాన్ని వ్యాప్తిలోకి తేవడం మన పెద్దలే కాదు ఎవరిపెద్దలూ అంగీకరించరు. ప్రస్తుతం సత్రాజిత్తు శ్రీకృష్ణ భగవానుడ్డింగూర్చి అపోహపడడానికి కొంత అవకాశంవుంది. శ్రీకృష్ణుండు అతని దృష్టికి (చుట్టమవడంచేత) మనుష్య మాత్రుండుగానే తోcచివుంటాండు. కృపుని జీవితకాలంలో ఆయన్ని భగవదవతారంగా గుర్తించినవారు భీష్మండు, విదురుండు, అక్రూరుండు మొదలైన కొందఱుమాత్రమే. శిశుపాలుండు, దుర్యోధనుండు, లోనైనవాళ్లు ఆమరణాంతమూ యథార్థాన్ని గుర్తించనే లేదు. ఆ యీ సందర్భం యీ పద్యం తెల్పుతుంది.