పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది



పశ్చాత్తాపము

సత్రాజిత్తుపేరు యెవరోగాని యొఱకుండా వంగగ యింతటి పరమోత్తముండు వేలకు వొక్కండుంటాండో వుండండో!

లోకంలో యెంతటి యోగ్యునికీ, యెంతటి బుద్ధిశాలికీ ప్రమాదం వుంటుంది. ఆ ప్రమాదం కొందఱికి కాలాంతరమందు తమకే గోచరిస్తుంది. కొందఱికో? యెవరో సూచించాక గోచరిస్తుంది. కొందఱికి యేవిధంచేతా గోచరించదు. అధవా గోచరిస్తుందే అనుకుందాం. తాను చేసిన తప్పిదాన్ని పశ్చాత్తాపంద్వారా తొలంగించుకొని నిర్దోషత్వాన్ని సంపాదించుకోవడం, "పెద్ద అవమానంగా" తోచి తన మనస్సు తనకు మంచిగా బోధిస్తూవున్నా దానిబోధకు కట్టుపడక "తాంబట్టిన కుందేటికి మూండేకాళ్లు" అనే ధోరణిలోకి దిగి మొదటచేసిన దోషాన్ని వేయింతలుగా పెంపు చేసుకోవడమే తఱచుగా లోకంలో అనుభూతం. రాజ్యాదులు వున్నవారిని గూర్చి యీ విషయం మటీ అనుభూతం. రాజుగారు తప్పచేసినా దాన్నియెవరూ తప్పని తెలుపంగూడదు ప్రత్యుత, వొప్పగా సమర్ధించాలి. రాజసేవకులు మంత్రి, మొదలు కాళ్లు పిసికేవాండిదాంకా యీ గుణం వుంటేనేగాని వాఁడు యెందుకూ పనికిరాడూ, యీ గుణం గృహస్టుభార్యలకున్నూ ఆవశ్యకమే. భర్తచేసే తప్పలను భార్య బాగా తెలుసుకొన్నప్పటికీ చట్టన సూచించకూడదు. సూచిస్తే యెంతో ప్రాజ్ఞండైతే తప్ప సర్వసాధారణంగా భర్త కోపోద్దీపితుండవుతాడు.

"పాతివ్రత్య ధర్మాలు చాలా కఠినధోరణిలో వుంటాయి. ఆయీ ధర్మాలు భర్త పరమశుంఠగా వున్నా దుర్మార్గుండుగా వున్నా అప్రయోజకుండుగా వున్నా ఆయనపట్ల భార్య చెల్లించవలసినవే, పైకి అడగి మడంగి చెల్లించినా హృదయంలో భర్తయొక్క “అపాత్రత్వం" గోచరించకపోదు. కాని ఆలా గోచరించడంకూడా తప్పిదమే అన్నారు. విషయం విషయాంతరములోకి దూCకుతూవుంది. అసలు వ్యాసం

“సత్రాజిత్తు" యోగ్యతనుగూర్చి ఆరంభించాను. ఇతండు పెద్ద తప్పిదాన్ని చేశాcడు మొట్టమొదట; ఆ తప్పిదంయొక్క స్వరూపం అక్షరాస్యులందఱూ యెఱిఁగిందే, అయినా వివరిస్తాను. సూర్యోపాస్తి ద్వారా తాను- “శ్యమంతకమణిని" సంపాదించుకుంటే, అది కృష్ణమూర్తి అపహరించినట్లు అభిప్రాయపడి ఆ హరిమీద “నీలాపనింద” ఆరోపించాడు.