పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భీష్మ బ్రహ్మచారి గురుశిష్యవివాదం న్యాయసమ్మతమేనా?

113


ఈ పరశురాముడు సాక్షాత్తూ పరమేశ్వరుండి దగ్గిఱ శస్త్రవిద్యాభ్యాసం చేసినట్టున్నూ, ఈశ్వరుండున్నూ, పార్వతిన్నీ యీయన్ని కుమారస్వామి కన్నా మిన్నగా ఆదరించినట్టున్నూ తఱుచు నాటకాలలో కవులు వ్రాస్తూవచ్చారు. పురాణాలలో ఈ విషయం యొక్కడవుందో తెలియదు. అంతో యింతో ఈశ్వరశిష్యరికం అర్జునుండిక్కూడా వుండడంచేత పరశురాముండున్నూ అర్జునుండున్నూ సతీర్ధులనికూడా అనుకోవచ్చును. భీష్మలవారో యీశ్వరుcడికి ప్రశిష్యుCడు. ఇంతటిస్వార్థత్యాగి అప్పడేకాదు యెప్పడున్నూ లేఁడని చెపితే వొప్పనివారుండరు. స్వార్ధత్యాగులలో శ్రీరాములవారు ప్రథమగణ్యులే, కాని ఆయన వివాహాన్ని కూడా మానుకున్నవారుకారు. రావణవధానంతరం చాలాకాలం రాజ్యంకూడా చేసివున్నారు. భీష్ముండో వివాహాన్నీ వదలుకున్నాండు, రాజ్యాన్నీ వదలుకున్నాండు. అట్లని తపస్విగా వుండలేదు. కుల ధర్మమైన క్షాత్రాన్ని నిర్వహిస్తూ బ్రహ్మచర్యాన్ని అవ్యాహతంగా

"... ... ... ... ... ... ...జ
న్మావధి చచ్చునంతకు రవంతయు లోటునులేనివారి నెం
దేవినియుంటిమే? ... ... ..."

అని యీయన్నిగూర్చి అశ్వమేధంలో మేము ప్రశంసించివున్నాము. యిట్టి భీష్మునికి సకల ధర్మవేత్తకు అంతో యింతో కాక తన యావత్తు ధనుర్విద్యకున్నూ మూలభూతుండైన పరశురామునితో యుద్ధం చేయక తప్పింది కాదు. దైవతంత్ర మనివార్యం కదా! యే కొంచెం గురుశిష్యభావం వున్నా గురువును యెదిరించడానికి శిష్యుండికి అధికారం లేనట్టు మన ఆర్యులమతం చెపుతుంది. అట్టిస్థితిలో భీష్ముండు చేసినపని సూల దృష్టిని విచారిస్తే సమర్థనీయం కాదు. అయితే పరశురాములు కేవలం ఆశ్రితపక్షపాతాన్నే పురస్కరించుకొని చేయందలంచుకొన్న వుపకారానికి భీష్మణ్ణి తోడ్పడవలసిందని విధించాcడు. ఆపనిచేస్తే భీష్మండు కేవలం నింద్యండు కావలసివస్తుంది. అందుచేత అందుకు అంగీకరించలేక పోయాండు. దానితో శీఘ్రకోపి కావడంచేత పరశురాములు మండిపడి తనతో యుద్ధానికి రమ్మన్నాండు. భీష్ముండు యెన్నోవిధాల బతిమాలుకున్నాండు కాని పరశురాములు వినలేదు. తనగండ్రగొడ్డలికి యెందతో యిదివఱలో క్షత్రియులు బలి కావడంచేత భీష్మణ్ణికూడా ఆలాగే చేయంగలనుకదా! అని ఆయనకి పూర్తి ధిమాకువుంది. భీష్ముండికో? గురువుగారు తన్నయితే వోడించలేరని తెలుసునుగాని ఆయనికి యెదురుగా వుండి యుద్ధంచేయడం ధర్మం కాదని సంశయింపవలసివచ్చింది. అందుచేత బతిమాలు కోవడానికి మొదలు పెట్టాండు. పోనీ గురువుగారు చెప్పినట్టు చేస్తేనో? యిహపరాలు రెండూకూడా చెడతాయి.