Jump to content

పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

యావత్తుశస్తాస్తాలున్నూ పరశురాముండు ద్వారాగానే వచ్చినట్లు భారతంవల్లనే తేలుతుంది. అర్జునుండికో? అలా కాదు. ముందత్తిగా బడిచదువు ఓనమాల మోస్తరు శస్త్రవిద్య కృపాచార్లగారి వద్ద జరిగింది. తరువాత చాలాగ్రంథం ద్రోణాచార్లగారివద్ద జరిగింది. ట్రయినింగుకూడా ద్రోణాచార్లగారివద్దనే అనుకోవాలి. ద్రుపదుణ్ణి కట్టి తీసుకురావడం ఆ ట్రయినింగులోకే చేరుతుంది. ఇంతతోకూడా యితని విద్య సమాప్తం కాలేదు. శ్రీ పరమేశ్వరుండు, దేవేంద్రుండు మొదలైన దిక్పాలకులు వీరంతా అర్జునుండికి అంతో యింతో గురుత్వం చేసినవారే, ప్రధానగురువైన ద్రోణాచార్లగారికికూడా తెలియని మోహనాస్త్ర ప్రయోగంకూడా మన అర్జునుండికి తెలుసును. యిది భీష్ముడికి సోదర ప్రాయులైన వసువుల ద్వారాగా సంక్రమించింది. అర్జునుండికి దీన్ని తాతగారుపదేశించినట్లు భారతంలో కనపడదు. బహుశః స్వర్గంలో యింద్రాదులు కొన్ని అస్తాలు ప్రసాదించిన తరుణంలో వసువులు దీన్ని ప్రసాదించి వుంటారని తోస్తుంది. నన్నయ్యగారు -

"...పాశుపతాదిక దివ్యబాణముల్
హరసుర దేవరాజ నివహమ్ములచేఁ బడసెంగ్రమమ్మునన్."

అని సంగ్రహంగా చెప్పివున్నారు. ఏమైనా అర్జునుండు మాదిరిగా భీష్ముండు చాలామందివల్ల ధనుర్వేదాన్ని అభ్యసించలేదు. ఒక్క పరశురామునివల్లనే సమస్త ధనుర్విద్యను సంపాదించుకున్నాండు. తండ్రిగారికి ద్వితీయ వివాహం చేయవలసివచ్చి &9 సందర్భంలో అవసరమవడంచేత బ్రహ్మచర్యవ్రతాన్ని పూని గురువుగారికి సర్వవిధాలా దీటయిన శిష్యుండని పించుకున్నాండు. పరశురాములవారు ఆజన్మబ్రహ్మచారిగా యెందుకు వుండవలసివచ్చిందో? చూచినంతలో నాకు యేగ్రంథంలోనూ వుపలబ్ధం కాలేదు. మురారి నాటకంలో - "శ్లో ఆజన్మ బ్రహ్మచారీ" అని వ్రాయCబడివుంది. బహుశః యొక్కడో ఈ విషయం పురాణాలలో వుండేవుంటుందనుకోవాలి. అదిన్నీ కాక ఆయనకు కాస్త గోcచీ పెట్టేవయస్సు వచ్చింది మొదలుకొని యెవళ్లతోనో రాజులతో పోట్లాటలతోనే సరిపోయింది. అందులో యెదురుకున్నవాళ్లే లేరుకదా! తుదకు శ్రీరామమూర్తివారు కాంబోలును కాస్త క్షత్రియతేజాన్ని చూపించారు. ఉభయులున్నూ విష్ణుతేజస్సంభవులే అవడంచేత అందులో అంత అవమానం వున్నట్టు ఆయనా భావించుకొన్నట్టులేదు; చరిత్రకారులున్నూ భావించు కోలేదు. కాని అది మొదలుకొని వైరాగ్యానికి దిగి యేదో తపోగోష్టితో మహేంద్రపర్వతం మీఁద కాలక్షేపం చేయడంతప్ప ఆయనకి యితర ప్రసక్తి లేనేలేదు. చాలాకాలం యుద్ధాలే. పిమ్మట తపస్సు, యిఁక వివాహ ప్రసక్తికి అవకాశం యొక్కడ?