పుట:Chellapilla Venkata Sastry 2016-08-13.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కథలు - గాథలు * చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

అందుచేత అంబా వివాహానికి వప్పుకోలేక పోయాండు. గురువుగారు “కత్తేస్తావా? బద్దేస్తావా?” అంటూ గండ్రగొడ్డలి చూపిస్తూ ప్రాణగొడ్డంగా భయపెట్టడానికి వుపక్రమించారు. చూపిస్తే చూపించారుగాక? ఆయన పెద్దలు అని వెనుకదీస్తే కులధర్మానికే లోటు రావలసివచ్చింది. యెట్లో బతిమాలు కుందామంటే బతిమాలినకొద్దీ బిల్దబిగిసి కయ్యానికి కాలు ద్రవ్వడం జరిగింది. దానిమీంద కొంచెం బెడిదంగా జవాబుచెప్పి చూచాండు. ఆ బాపతు పద్యం వకటి వుదాహరిస్తాను.

క. క్షత్రియులం దొల్లి యలుకకుం
బాత్రముచేసితటే? నాcడుబలియుండు గంగా
పుత్రుండు పుట్టమిం గా కిది
యీ త్రయినింకేల? చెల్లు నెఱుంగవె? నన్నున్.

యిలా కొంచెం బెడిదంగా మాట్లాడింది సర్వసన్నద్ధుఁడై వచ్చిన తరవాతనే. అంతకుముందు యింతకంటె కొంత మృదువుగానే మాట్లాడి చూచాండు.

“ಇట్టి కృత్యం బాచరించుటకంటె నీచేత నెట్లయినను లెస్స"

అన్నాండు. అని వూరుకోలేదు; అక్రమంగా, అధర్మంగా, అనవసరంగా నన్నుమీరు యుద్ధానికాహ్వానిస్తూవున్నారు. యిందులో నేను మిమ్మల్ని వోడించవలసివస్తుందని సంశ యిస్తానేమో అని మీ అభిప్రాయమేమో? అట్టి సంశయంతో నాకు లేశమున్నూ అవసరం లేదు. అయొచ్చేది పయెుచ్చేదీ ఆలోచించకపోవడమే కాకుండా ధర్మాధర్మ విచక్షణకూడా చేయకుండా నన్ను మీరు ఆహ్వానిస్తున్నారు. అని యీ క్రింది మాటలు పలికినాఁడు.

తే.గీ. "గర్వియై కార్యమిట్టి దకార్య మిట్టి
దని యెఱుంగక లోకంబు చనుపథమునం
దిరుగ కున్మదవృత్తి వర్తించునట్టి
వాని గురునైన దండింపవలయు నండ్రు"

పయికిట్లు చెప్పడమైతే చెప్పినాండు విధిలేక కాని భీష్మునికి సుతరామున్నూ గురునితో యుద్ధం చేయడం యిష్టంలేదు. లేకపోతే మాత్రం తప్పుతుందా? గురువుగారు మూర్ధప్పట్టు పట్టి కూర్చున్నప్పడు. సరే యేలా గయితే యేమీ “అంగీకృతా గ్లానిర్నదోషాయ" అనుకొని యుద్ధరంగంలోకి ప్రవేశించాcడు. చాలా రోజులు యుద్ధం జరిగింది. తుట్టతుదకు మోహనాస్త్ర ప్రయోగంతో శిష్యుండు గురువుగారిని విజితుణ్ణి చేయడానికి సిద్ధపడుతూ వుండంగా నారదాది మహాఋషులు- “ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః" చెప్పి గురువుకు