పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడుగారు

67

ములఁ గొనుచుఁ బ్రజలకు మిక్కిలి పీడ గల్గించుచున్న యాపచ్చెపుదొంగలలో బహుప్రయత్నమున వేంకటాద్రినాయఁడు నూర్గురను బట్టించి వరుసగా నిల్వఁబెట్టి తలలు నఱకఁ దలారుల కనుజ్ఞ నొసఁగెనఁట! ఒకకొననుండి నఱకఁ బ్రారంభింపఁబోఁగా నచ్చటివాండ్రు, అటునుండి కొట్టుకొనుచు రమ్మని కోరిరట! (కొందఱ నఱికినతర్వాతనేని జాలి వొడమక పోదని) నాయఁడుగారును నట్లే రెండవప్రక్కనుండి యారంభింపఁజేసి నిశ్శేషముగనే సంహరింపించి ప్రజలకుఁ జోరభీతి మాన్పిరఁట!

మ. వరహా ల్కానులభంగి సాలువులు కంబళ్ళట్ల రూపాయలున్
    మఱి గవ్వల్వలెఁ గంకణమ్ములుఁ దృణప్రాయమ్ముగా నిచ్చి బం
    గరుపళ్ళెంబులఁ బాయసాన్నములుఁ లక్షబ్రాహ్మణాపోశనం
    బర లే కిత్తువు వాసిరెడ్డి కులదీపా! వేంకటాద్రీశ్వరా!

ఒకప్పుడు, వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడును, నర్సారావుపేట మల్రాజు గుండారాయఁడును, నుజివీటి యప్పారావును, చల్లపల్లి యంకినేఁడును, మొదలుగాఁ గొందఱు జమీందారులు కూడి యిష్టగోష్ఠీవినోదము సల్పుకొను సందర్భమున హాస్యచతురుఁడగు గుండారాయఁడు ‘మనజీవితములు కడచనినతర్వాత లోకము మనల నెట్లు ప్రశంసించునో తలఁచి చూచుకొందమా’ యనెనఁట! అందఱు నంగీకరించి రఁట! ఇట్లు పేర్కొనెనఁట! ‘నూజివీటి యప్పారాయఁడు చనిపోయెనా బైరాగులందఱును బలివించెదరు. తాను చనిపోయితినా వేశ్యలందఱును విలపించెదరు. వేంకటాద్రినాయఁడు చనిపోయెనా యందఱును నల్లో యని