పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

చాటుపద్యమణిమంజరి

వత్సవాయవారు

ఉ. తీరుగ వత్సవాయతిమ్మ జగత్పతికీర్తిహార మా
    హారశరద్ద్విజన్మకులిశాయుధజాతుల మించె శౌర్యమా
    హారశరద్ద్విజన్మకులిశాయుధజాతుల మించె రూపమా
    హారశరద్ద్విజన్మకులిశాయుధజాతుల మించె నిద్ధరన్.
ఉ. రాజులరాజు లోభి యొకరాజులరా జతిమూర్ఖుఁ డష్టది
    గ్రాజులరాజు చోరుఁడు విరాజులరా జొక పక్షి తారకా
    రాజులరాజు దోషి ఫణిరాజులరా జొకవక్రగామి యీ
    రాజులు రాజులా సుగుణరాజులరాజవు నీవుగాక యో
    రాజవతంస? వత్సవయ రాజమహీపతి, తిమ్మభూపతీ!
ఉ. రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీనుఁ డంబికా
    రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతరసీమ నుండు వి
    భ్రాజితపూసపాడ్విజయరామనృపాలుఁడు రాజుగాని యీ
    రాజులు రాజులా పెనుతరాజులు గాక ధరాతలంబునన్.

వాసిరెడ్డి వేంకటాద్రినాయఁడుగారు

ఈకమ్మప్రభువు పదునాఱవశతాబ్దితర్వాతఁ గృష్ణాతీరమందలి యమరావతి రాజధానిగాఁ గొంత తెల్గుదేశ మేలినవాఁడు. మహాదాత. శూరుఁడు. ‘అటునుండి కొట్టుకు రమ్మన్నారు’ అనుసామెత కీతఁడే జననకారణము. ఆకాలమునందు దారిదోఁపుడుగాండ్రు మెండుగాఁ నుండిరఁట. అనేకుల ప్రాణధన