64
చాటుపద్యమణిమంజరి
‘మన్నారుదాసవిలాస’ మనుపేర నీయన శృంగారచరిత్రమునే గ్రంథముగా రచించినది. ఆపె యారాజేంద్రునిచేఁ గనకాభిషేకసత్కారమును వడసినది. ఆయనవలపునెలఁత. ఎల్లవేళలయందును వెల్లాటకత్తెతో నానందించు నీనృపాలుని మహిషి తనయాగ్రహము నాపుకొనఁజాలక యొకనాఁ డావారాంగనకు దూషణోక్తులతో నొకదూతికమూలమున వార్త నంపె నఁట! విదుషీమణి యగునావారాంగన యాదూతి కీపద్యమును రచించి చెప్పి పుచ్చెనఁట—
ఉ. ఏవనితల్ మముం దలఁప నేమిపనో? తమ రాఁడువారు గా
రో? వలపించునే ర్పెఱుఁగరో? తమకౌఁగిటిలోన నుండఁగా
రా వదియేమిరా విజయరామ! యటం చిలు దూఱి బల్మిచేఁ
దీవరకత్తెనై పెనఁగి తీసుకవచ్చితినా తలోదరీ!
ఉ. రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ నల్లినా వదే
మే జడ? యింతకంటె వలెనే? వలనొప్ప బిగించి యల్లవే
యోజవరాల వేఱె పనియున్నది; దోసమె దోసమే మహా
రా జగునట్టి యవ్విజయరాఘవు మై చిగురాకె కోమలీ!
చ. కులికెద వేటికే చెలియ! కుంచెఁడు మానెఁడు గాను నెల్లవా
రలు వినినారులే; విజయరాఘవరాయఁడు నిన్నుఁ గూడుటల్
వలపులె చాటుచున్నవి జవాదియు నల్దవు విఱ్ఱవీఁగఁగా
వలెనటె చూచియోర్తురటె వంతులు జంతు లవేటియెమ్మెలే?
క. ఇంతీ! పానుపుపైనిదె
కంతుఁడు కూర్చున్నవాఁడు కనుఁగొను మహహా!
కంతుఁ డనంగుఁడు నీతెలి
వింతేనా విజయరాఘవేంద్రుఁడె చెలియా!