పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తంజావూరి విజయరాఘవరాయలు

63

గీ. సమరతలమునఁ దమప్రాణసతిని దలఁచి
    సుఖము గోరునె జోగులనుతుఁడు గాక
    యనుచు గెల్వంగ నేర్తువౌ నాహవమున
    భూనుతాటోప! తిమ్మయ బుక్కభూప!

తంజావూరి విజయరాఘవరాయలు

ఈతఁడు తంజాపురము నేలిన యాంధ్రనాయకరాజు. రఘునాథరాయల కుమారుఁడు. మహారసికుఁడు. మహాదాత. మహాకవి.

లయగ్రాహి. తావిజగడంపు సిగపూవులసరుల్ తళుకు
                    మోవి పలుగెంపు బురుసావలువు సొంపుల్
    ఠీవిదులకింపు నొకతావి చుఱుకు న్మరుతు
                    మావుపయి నెక్కి పురిలో వెడలి రాఁగా
    నీవగలు చూచి చెలి రేవగలు సొక్కుచును
                    పూవుజముదాడి దొరహావళికిఁ జిక్కెన్
    మావెలఁది నేలుకొన రావలదె నీవు దయ
                    తో విజయరాఘవమహీవర! పారాకా!
క. భూతలమున శిబికర్ణులు
    దాత లనేసుద్ది సుద్దదబ్బర నిన్నెం
    చేతఱి వదాన్యుఁ డెవ్వడు
    రా? తంజావూరి విజయరాఘవనృపతీ.

ఈయన యాస్థానమున రంగాజి, కృష్ణాజి మొదలకు వారాంగనలు, సరసకవిత నేర్చివా రుండెడివారు. అందు రంగాజి