పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

చాటుపద్య మణిమంజరి

[1]నెల్లూరుప్రాంతమునఁగల పట్టుపురాయిగ్రామానకుఁ దూర్పుభాగమునఁ బినాకినీనదీతీరమునఁ దిక్కనపాడనుస్థలము గలదు. ఆస్థలమందు గుఱ్ఱముమీఁద రౌతును జెక్కినశిల యొకటి నేఁటికిని గలదు. అది తిక్కనప్రతిమ యని స్థలజ్ఞులు చెప్పుదురు.

నెల్లూరు

సీ. ధీరుఁడై ధరయేలెఁ దిరుకాళదేవుండు
                    తిక్కనాయకుఁ డేలెఁ దేజ మెసఁగ
    మన్మసిద్ధన యేలె మహిమతో దీపించి
                    దాదినాగన యేలె ధర్మరీతి
    మనుగండగోపాలమనుజాధిపతి యేలె
                    స్వర్ణదేవుం డతిప్రభగ నేలె
    గోపినాథుం డేలె గుణపయోరాశియై
                    రమణతో శ్రీరంగరమణుఁ డేలె
గీ. తిక్కనయు మఱియొకకొన్నిదినము లేలె
    నేలె మీతండ్రి మర్యాద లెల్లఁ గలుగఁ
    గడఁక నీవేలి తందఱకంటె మించి
    శరధిగంభీర! సంగమక్ష్మాతలేంద్ర!
సీ. పాలించు నేవీట బ్రహ్మాదివంద్యుండు
                    లీల మూలస్థానలింగగురుఁడు
    దీపించు నేవీట దేవాలయంబులు
                    ధావళ్యనవసుధాధౌతము లయి

  1. ఈవిషయము ప్రాచ్యలిఖితపుస్తకభాండాగారమందలి చారిత్రకసంపుటములం దున్నది.