కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు
117
పగులఁగొట్టించి తుద్భటవివాదప్రౌఢి
గౌడడిండిమభట్టు కంచుఢక్క
చంద్రభూపక్రియాశక్తి రాయలయొద్దఁ
బాదుకొల్పితి సార్వభౌమబిరుద
తే. మెటులు మెప్పించెదో నన్ను నింకమీఁద
రావుసింగమహీపాలు ధీవిశాలు
నిండుకొలువున నెలకొనియుండి నీవు
సకలసద్గుణనికురంబ! శారదాంబ!
సింగభూపాలుపైఁ జెప్పినది—
క. సర్వజ్ఞ నామధేయము
శర్వునకే రావుసింగజనపాలునకే
యుర్విం జెల్లును దక్కొరు
సర్వజ్ఞుండనుట కుక్క సామజ మనుటే.
ఆయాస్థానమున నొకబట్టుకవి యిచ్చిన సమస్య—“కుక్కవొ నక్కవో ఫణివొ క్రోఁతివొ పిల్లివొ బూతపిల్లివో” కవిసార్వభౌముని పూరణము—
ఉ. తక్కిన రావుసింగవసుధావరుఁ డర్థుల కర్థ మిచ్చుచో
దిక్కులలేనికర్ణుని దధీచిని ఖేచరు వేల్పుమ్రానుఁ బెం
పెక్కిన కామధేనువు శిబీంద్రుని నెన్నుదు భట్ట! దిట్టవై
కుక్కవొ! నక్కవో! ఫణివొ! క్రోఁతివొఁ! పిల్లివొ! బూతపిల్లివో!
శ్రీనాథుఁడు రెడ్లయాస్థానకవి. రెడ్లకు వెల్గోటివారికి వైరము. ఈతఁడు తిరిగి రెడ్లయాస్థానమునకుఁ బోఁగాఁ దమశత్రువగు సింగమనేని నట్లు పొగడినందుకు వారు కుపితులై యిచ్చకాలమారి వని చుల్కనచేసి పల్కిరఁట! నే నాపద్యమున నాతని గూఢముగా వెక్కిరించితినేగాని పొగడలేదని