Jump to content

పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

చాటుపద్యమణిమంజరి

దిగ్గు రనునట్లు స్వర్గమున కరిగిన యుద్దండపండితకవిని దెల్గుదేశమున మాతృభాషాభిమానులలో నెఱుంగనివా రుండరు. ఈమహాకవిచే శృంగారనైషధాదులగు ప్రబంధములే కాక యింక ననేకము లగు చాటుపద్యములును రచియింపఁబడినవి. అందు రసోత్తరము లిం దుదాహరింపఁబడును.

శ్రీనాథుఁడు కర్ణాటాంధ్రరాజ్యాధీశ్వరుఁడగు సంబుపరాయని తెలుంగురాయలయొద్ద కరిగి యాతని నాశీర్వదించినది—

శా. ధాటీఘోటకరత్నఘట్టనమిళద్ద్రాఘిష్ఠకల్యాణఘం
    టాటంకారవిలుంఠలుంఠితమహోన్మత్తాహితక్షోణిభృ
    త్కోటీరాంకితకుంభినీధ సముత్కూటాటవీఝాటక
    ర్ణాటాంధ్రాధిప! సాంపరాయని తెలుంగా! నీకు బ్రహ్మాయువౌ.
ఆనృపాలునిఁ గస్తూరి యాచించుచుఁ జెప్పిన పద్యము—
శా. అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ! కస్తూరికా
    భిక్షాదానము సేయురా సుకవిరాడ్బృందారకశ్రేణికిన్
    దాక్షారామచళుక్యభీమవరగంధర్వాప్సరోభామినీ
    వక్షోజద్వయకుంభికుంభములపై వాసించుఁ దద్వాసనల్.
వెల్గోటిరాజును బండితకవియు నగు సర్వజ్ఞసింగభూపాలు నాస్థానమునకుఁ బోయి యానృపాలుని కొల్వుకూటమునకు ముందుఁ బూజింపఁబడుచుండెడు శారదావిగ్రహమును గాంచి యాతఁడు చెప్పిన పద్యము—
సీ. దీనారటంకాలఁ దీర్థ మాడించితి
                    దక్షిణాధీశు ముత్యాలశాల
    పలుకుఁదోడై తాంధ్రభాషామహాకావ్య
                    నైషధగ్రంథసందర్భమునకు