కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు
115
బొట్టగడపుకొనుచుండెను. భీమకవి యొకనాఁడు రాత్రి పల్లకి నెక్కి దివటీలతో నెక్కడకో పోవుచుండఁగా నాతఁడు త్రోవ నేఁగుచుఁ జీకటిలో నొకగోతఁ గూలి ‘అయ్యో! కాలిదివటీ యైన లే దయ్యెఁగదా’ యనుకొని చింతిలెనఁట! అది భీమకవి విని ‘నీ వెవ్వండ’ వని యడుగ ‘భీమకవిగారిచే జోగి చేయఁబడినవాఁడ’ ననెనఁట! భీమకవి ‘రాజకళింగగంగువా’ యనఁగా నాతఁడు కేల్మోడ్చి ‘రక్షింపుఁ’ డనెనఁట! అంతట—
ఉ. వేయుగజంబు లుండఁ బదివేలు తురంగము లుండ నాజిలో
రాయల గెల్చి సజ్జనగరంబునఁ బట్టము గట్టుకో వడిన్
రాయకళింగగంగు కవిరాజ భయంకరమూర్తిఁ జూడఁగాఁ
బోయెని మీనమాసమునఁ బున్నమవోయినషష్ఠినాఁటికిన్.
అని యాశీర్వదించి తిరిగి లబ్ధరాజ్యునిఁ జేసెనఁట!
ఉ. రామునమోఘబాణమున రాజశిఖామణికంటిమంటయున్
భీముగదావిజృంభణ ముపేంద్రునివజ్రము చక్రిచక్రమున్
దామరచూలివ్రాఁతయును దారకవిద్విషుఘోరశక్తియున్
(వే)లేములవాడభీమకవివీరుని తిట్టును రిత్తవోవునే!
కవిసార్వభౌముఁడు శ్రీనాథుఁడు
క్రై.1380 ప్రాంతమున జనియించి 1450 తర్వాతవఱకు జీవించి పూర్ణపురుషాయుషజీవియై యనేకసుకవిరాజసమ్మానములఁ గాంచి యాంధ్రకవిమండలియం దనన్యసామాన్యమైన సుప్రతిష్ఠ నంది మహాభోగముల ననుభవించుటయకాక తుదకుఁ గష్టములఁగూడఁ జవిసూచి బృహస్పతికి సయితము గుండియలు