పుట:Chatupadhyamanimanjari - Veturi Prabhakar Sastry.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

చాటుపద్యమణిమంజరి

శ్రీనాథుఁ డిట్లాపద్యమున కన్వయము చెప్పెనట! “సర్వజ్ఞ నామధేయము శర్వునకే. రావుసింగజనపాలున కేయుర్విం జెల్లును? (శివునిఁగాక) తక్కొరు సర్వజ్ఞుం డనుట కుక్క సామజ మనుటే.”

వేఱొకప్పుడు వెల్గోటి మాదయలింగమనేఁడు రెడ్లకఠారిని గైకొనఁగా నాకఠారిని దిరిగి రెడ్లకడకుఁ జేర్చుటకై శ్రీనాథుఁ డాతనికడ కరిగి పొగడిన పొగడ్త—

సీ. జగనొబ్బగండాంక సంగ్రామనిశ్శంక
                    జగతీశ రాయవేశ్యాభుజంగ
    అఖిలకోటలగొంగ యరిరాయమదభంగ
                    మే లందు ధరణీశమీనజాల
    మూరురాయరగండ ముఱియురాజులమిండ
                    యభివృద్ధి మీరు చౌహత్తమల్ల
    ఘనగాయగోవాళకామినీపాంచాల
                    బ్రహ్మాయు శశివంశపరశురామ
తే. దండిబిరుదులసురతాణిగుండె దిగుల
    బళిర యల్లయవేముని పగరమిండ
    రమణమించినమేదిని రావుబిరుద
    సంగరాటోప! మాదయలింగభూప!
కర్ణాటరాజ్యమున కరిగినప్పు డారాజు మీవాసస్థల మెట్టి దనఁగాఁ జెప్పినది—
సీ. పరరాజ్య పరదుర్గ పరవైభవశ్రీలఁ
                    గొనకొని విడనాడు కొండవీడు
    పరిపంథిరాజన్యబలముల బంధించు
                    కొమరు మించినబోడు కొండవీడు
    ముగురు రాజులకును మోహంబు పుట్టించు
                    గుఱుతైన యుఱిత్రాడు కొండవీడు