పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

198

చాటుపద్యరత్నాకరము

చిత్రకల్పన

సీ. 1. అరిభయంకరచక్ర కరిరక్షసాగర
               చాయశ్రీకర్బురసాటియుగళ
   2. నాళీకసన్నిభనయన యండజవాహ
               వాణీశజనకవైభవబిడౌజ
   4. రాజీవమందిరారమణ బుధద్రక్ష
               వరజటిస్తుతశౌరి వాసుదేవ
   8. భూరికృపాకర బొబ్బిలిపురపాల
               పాపభుజంగమ పరమగరుడ
   16. దోషశైలేశ శశిద్రక్ష ద్రుహిణహేళి.


కీ. వాక్యము.

అ న్న య్య తో టి వి స్సా ప్ర గ డ కా మ రా జు భా షిం చు హే ళి దా క్షి ణ్య శా లి
   1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24


ఈచాటుపద్యమును బొబ్బిలిపురమున విస్సాప్రెగడ కామరాజకవి రచించినట్లు కీ వాక్యమువలనఁ దెలియుచున్నది. సీసగీతచరణములు తక్కినవి కవి రచించెనో లేదో కాని యెవరు చదివినను ఈపద్యమింతే. ఈపద్యచరణములకు మొదట—వరుసగా 1, 2, 4, 8, 16 అను నంకెలు వేసియున్నవి. కీ వాక్యము 24 అక్షరములఁ గలిగియున్నది.

ఇఁక నిందలి చిత్ర మేమనఁగా ఎవరైన నాంధ్రభాషలోని యొకయక్షరమును దలంచుకొన్నయెడల నీపద్యసహాయమున