పుట:Chatu Padya Ratnakaramu - Deepala Pichchayya Sastry.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థతరంగము

199

వారు చెప్పకయే మనము కనుగొనవచ్చును. అయితే ఆ యడుగువారొక కొన్నివిధులకు బద్ధులై యుండవలెను. ఎట్లన:— (1) అచ్చులలో ఆ యొకటిమాత్రమే తలఁచుకొనవలెను. (2) హల్లులలో ఙ, ఞ లు తలఁచుకొనవలదు. (3) గుణితముతోఁ బనిలేదు. (4) న, ణ; ల,ళ; ర,ఱ; ల కభేదము. ఇంతకును కీ వాక్యములో 24 అక్షరములలో దేనినేని కోరుకొనునట్లు చేయుటే దీని భావము.

పైవిధానమునకు లోఁబడి యెవరైన నడిగిరేని, యాయక్షరమును గనుగొనుటెట్లన — ముందు కీ వాక్యమును కంఠతః నేర్చుకొనవలెను. ఆపద్యము మొదటిచరణమును చదివించి విని యందు తలఁచుకోఁబడిన యక్షర మున్నదియు లేనిదియు తెలిసికొనవలెను. అట్లే 1,2,3,4,5 చరణములను వరుసగాఁ జదివించి ఆయక్షర మేయేచరణములలో నున్నదో తెలిసికొనుచుండవలయును. అప్పు డాయక్షరము కొన్నిచరణములం దుంటయుఁ గొన్నిటియందు లేకపోవుటయుఁ దటస్థించును. అప్పు డాయక్షరమున్న పాదములప్రక్కన వేయఁబడియున్నయంకెలను కలుపునది. అప్పుడు 10 వచ్చుననుకొనుఁడు. కీ వాక్యములోని 10వ యక్షరము —డ—గనుక, డ యని చెప్పునది.

ఒకయుదాహరణము. కోరుకొనఁబడిన యక్షరము—య—ఇపుడేమి చేయవలెను? ఇది 1,2 చరణములలోఁ దప్ప నిఁక లేదు గనుక—1+2=3. కీ వాక్యములోని మూఁడవ యక్షరము—య—చూచితిరా చిత్రము!