పుట:Chanpuramayanam018866mbp.pdf/6

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

[ 4 ]

గ్రామమునందలి దేవాలయములో నొక్క తెలుగుశాసనమును, దాని కనువా దముగా నొక యరవశాసనమును గలవుం. ఈశాసనములో వరద ప్పనాయనితో గూడ నిరువదియైదు తరములవారు పేర్కొనఁబడియున్నారు. వీరిలో వరదప్ప యను పేరుగల వాఁ డితఁ డొక్కఁడుమాత్రమే యున్నాఁడు. తిరుములార్యుని గౌరమించిన చెంజి వర దేంచుఁ డీవరదప్ప నాయఁడే యనుటకు సం దేహ ముండఁ గూడదనీ నాయభిప్రాయము, వరదప్ప నాయని శాసన సంవత్సరము క్రీ. 1671 సం వత్సరమునకు సరిపడును. ఇఁక వీర వేంకటపతిరాయశౌరి యెవ్వరో చూతము. పేరును బట్టి చూడ నీతఁడు కర్ణాటరా జని స్పష్టమగుచున్నది. సుప్రసిద్ధుఁ డగు వీర వేంకటపతి రాయలు క్రీ. 1614 ప్రాంతమున మృతి నొందెను. 1648 ప్రాంత మున శ్రీరంగరాయలు రాజ్యమునకు వచ్చి 1678 ప్రాంతమందు రాజ్య భాషుఁడై మహిసూరు దేశములో మృతినొందెను. ఈయిద్దజురాజుల నడిమికాలమునందుఁ బలువురు రాజ్యమును గాండ్రించుటచే ఘోరమగుపోరు పుట్టి శ్రీరంగరాయలు రామరాయలు వేంకటపతిరాయలు ననువారు స్వల్ప స్వల్ప కాలము సింహాసన మధిష్టించి పదభషు లగుచువచ్చిరి. శ్రీరంగ రాయలపిదప క్రీ. 1678-1680 సంవ త్సరములలో వేంకటపతిరాయలు రాజ్యముచేసినట్టులు కొన్ని శాసనములవలనఁ గనఁబడుచున్నది. ఈ వేంకటపతిరాయలకాలము చెంజి వరదప్పనాయనికాలము నకు సరిపోవుచున్నది. ఈతఁడే తిరువేంగళార్యుని గౌరవించిన వీర వేంకటరాయ శౌరియైనట్లు తోఁచుచున్నది. నిజముగా శ్రీరంగ రాయలతోడనే కర్ణాట రాజ్య మంత మైనది. అది మొదలు చాలకాలమువజకు నావంశములోనివా రెవ్వరో యొక రానెగొంది సమీప దేశమునకుఁ బ్రభువులై పూర్వాధికార మంతరించినను బూర్వరాజుల బిరుదములను మాత్రము 'పెట్టుకొనుచుండినట్లును, గౌరవార్థముగా వారినే కర్ణాట రాజులుగా మధురనాయకులు మొదలగువారు భావించుచుండిన ట్లును శాసనములవలనఁ గన్పట్టుచున్నది. ఇక వెలుగోటి వేంకటవిభుఁ డెవ్వరో చూడవలసి యున్నది. బ్ర. వెల్లాల సదాశివ శా స్త్రీగారు రచియించిన వెలుగోటి వారి వంశచరిత్రమువలన వేంకట యనునామముగల వారు QF-20. అం తరము లలో మాత్రమే యున్నట్టులు శనఁబడుచున్నది. 90వ తరము వాఁడైన యాచ - ఈసునములు రాజకీయశాసనాధికారులు 1917 సంవత్సరములో సంపాదించిన శాసనము లలో 860-881 సంఖ్యలు గలవి. వారికార్యస్థానమునఁ జూడనగు. wires

, Seweil's Lists of Antiquities Vol. II.