పుట:Chanpuramayanam018866mbp.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజయ మీవంశక్రమమును దృఢపఱుచుచున్నది. ఈ గ్రంథము 1786 వ (రసకరిమునిశశి) శాలివాహనసంవత్సరమునకు సరియైన ప్రభవసంవత్సరమునఁ బూరింపఁబడినట్లు గ్రంథాంతమం దున్నది. ఇది క్రీ. 1864 వ సంవత్సరమునకు సరి పోవును. అప్పటికిఁ గుమారవేంకటపెరుమాళ్రాజు సజీవుఁడై యున్నట్లును, నతనికి బ్రహ్మరాజు, కుమారవిజయవీరరాఘవరాజు, కావేరిరాజు, సింగరిరాజు ననునలుపురుకొడుకు లున్నట్లును జెప్పి యింకను బలువురు తనయులు కలుగుదురుగాక యని కవి యాశీర్వదించినాఁడు. క్రీ. 1884 సంవత్సరమునఁ గాలధర్మము నొందిన కుమారవేంకటపెరుమాళ్రా జీతఁడే యగుట నిస్సంశయము. ఈకుమారవేంకటపెరుమాళ్రాజు కసవరాజున కైదవ తరమువాఁ డగుచున్నాడు. ఆచారానుసారముగాఁ దరమున కిరువదియైదుసంవత్సరముల చొప్పున లెక్కించినచోఁ గసవరాజు క్రీ. 1714 సంవత్సరప్రాంతమువాఁ డగుచున్నాఁడు. స్టూలదృష్టిచే, క్రీ. 1700 సంవత్సరప్రాంతమువాఁ డనుకొందము.

వేఱొకలెక్కనుబట్టి చూచినను నించుమించుగా నీకాలమే ధ్రువపడుచున్నది. ఎట్లన :—

కవిగురువైన తిరువేంగళార్యుఁడు సాళ్వతిమ్మనృపాలుఁడు, వీరవేంకటరాయశౌరి, వెలుగోటి వేంకటవిభుఁడు, చెంజి వరదేంద్రుఁడు ననుప్రభువులచే గౌరవింపఁబడినట్లు గ్రంథములో నున్నది. (ఆ. 1 ప. 31.) సాళ్వతిమ్మనృపాలుఁ డెవ్వఁడో తెలియదు. ఆకాలమం దాపేరుగల సుప్రసిద్దరాజు గానరాఁడు. సామాన్యుఁ డైనజమీందారుఁడై యుండనోపును. చెంజి వరదేంద్రుని కాలము స్పష్టముగాఁ దెలియుచున్నది. దీనినిబట్టి యితరుల కాలము నిర్ణయింపవలసి యున్నది. చెంజి యనునది దక్షిణార్కాటు మండలములో సుప్రసిద్ధ మైనస్థలము. ఆంగ్లేయ భాషను దీనిని "జింజి" యందురు. కర్ణాటరాజ్యకాలమం దీచెంజిదేశమును గొందఱునాయఁకులు పాలించుచుండెడివారు. ఆనాయఁకులలో నొక్కఁడగు "చెంజి వరదప్పనాయనయ్యవారు తీర్థాచరణ వచ్చి శేతుదర్శనం శేశి స్వస్తిశ్రీశాలివాహనశకవర్షంబులు 1593 కల్యబ్దాః 4772 అస్మిన్ వర్తమానె వైశాఖబహుళసప్తమి స్తిరవారం యీపుణ్యక్షేత్ర మైన..........మరప్రదేశం ఆకార్తికశుద్ధపౌర్ణమినాడు కొమారస్వామికి బంగారు అందలమున్ను సమర్పణ శేశి తమఆరతిను యేర్పాటు శేయించినారు” అని మధురకు సమీపమందున్న సుప్రసిద్ధకుమారక్షేత్రమగు తిరుప్పరంగుండ్ర మను