పుట:Chanpuramayanam018866mbp.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

[ 5 ]

శూరున కెనమండ్రు కొడుకులు. వారిలో 'వేంకటాద్రినాయఁడు, వేంకటప్పనా యఁడు, చిన వేంకటప్పనాయఁడు నను ముగ్గురు వేంకటాభిథాను లుండిరి. వీరిసోద రుఁడును రాజ్యభర్తయునైన కుమారయాచమనాయుఁడు మహిసూరువారితో యుద్ధము చేసి జయమంది ( అబ్దుల్ ఫాదుషా" గారివలన బహుమానములు పొంది నట్లు బ్ర. సదాశివశాస్త్రిగారు వ్రాసినారు. అబ్దుల్ ఫొదుషా యనఁగా , అబ్దుల్ కుతుబ్ షా యను గోలకొండరాజు. ఈ రాజు శ్రీ. 1611 మొదలు 1672 వఱకు 'రాజ్యముచేసెను. ఇదియుఁ జెంజి వరదప్పనాయని కాలమునకు సరిపోవుచున్నది. . యాచళూరునిసోదరులు కూడ నీకాలమువారే, వారు ముగ్గురిలో నెవ్వరో యొకరు చంపూరామాయణములోఁ బేర్కొనఁబడిన వెలుగోటి వేంకటవిభుఁడు కావలయును. ఈ ప్రమాణములు మూఁటిని బట్టి తిరు వేంగళార్యుఁడు క్రీ. 167(80 సంవత్సరముల ప్రాంతమువాఁ డైనట్లు తేలినది. ఆతని శిష్యుఁడైన వేంకటా చలపతికవి క్రీ. 1700 ప్రాంతమందుఁ గృతినిర్మించుట యీకాలనిర్ణయమున కప్ రోధమేకదా!

కవికాలనిర్ణయము చేయుట కింకోకయాధారము కూడఁగలదు. వేంకటా చలపతికవి దామర యక్కన్నపాలుని సన్నిధికిం జని నప్పు డెవ్వరో వరకవి గంధసింధురము వచ్చె" నటన్న (నేను గవిరాజ కేసరి" నని కవి పల్కెనఁట. (చూ. ఆ. | ప. 38) ఈ యక్క నృపాలుఁ డెవ్వరో నిర్ణయింపవలసియున్నది. ధూర్జటి లింగకవి కృత (కాళహస్తిమాహాత్యమువలనఁ గాళహస్తి రాజవం శమం దక్కప్ప యను పేరు గలవారు నలువు రున్నట్లు తెలియవచ్చుచున్నది. వారిలో మొదటివాఁడు చెన్న పట్టనమునకుఁ బేరొసంగిన చెన్న ప్పనాయని రెం డవకుమారుఁడు. ఈతఁడే ఉషాపరిణయ గ్రంథకర్త. ఈయక్కప్ప సొయని మను • మఁడుఁగూడ నక్కప్పయే. ఈ రెండవయక ప్పకు, అక్కప్పయను కుమారుఁడును మనుమఁడును నమక్కయను గూఁతురునుండిరి. అమక్క వెలుగోటి వీరకుమార యాచమనేని భార్యయై బంగరు యాచమ నేనిం గనియెనఁట. ఈ బంగరు యాచమ నీడు క్రీ. 1693 వ సంవత్సరముపజకు సజీవుఁడై నట్లు వెలుగోటివారి వంశచరి త్రము చెప్పుచున్నది. . కావున, బంగరు యాచమ సని మేనమామకుమారుఁడగు - నాలుగవయక్కప్ప క్రీ. 1700 సంవత్సర ప్రాంతమువాఁ డనియు 'వేంకటాచలపతి కవికి సమకాలికుఁ డనియుఁ దేలుచున్నది. ఏవిధమునఁ జూచినను నేంకటాచల,

" ఈ గ్రంథము వ్రాతప్రతి, యాంథ సాహిత్య పరిషత్సు స్తకభాండాగారమునఁ జూడగగు,