పుట:Chanpuramayanam018866mbp.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32 చంపూరామాయణము

చ. కరువలి వారిమేనులును గౌనులుఁ గీల్జడలుం దొడ ల్నడల్
తఱులుఁ గురు ల్మరుల్కొలుపఁ దానిపు డెక్కడ సంతరించెనో
శరశత మైదుకైదువులజంత యటంచు విరాళి కొగ్గి డ
గ్లఱుటయు రాచకూఁతురుల గాలికి గీలికి సోఁక శక్యమా. 99

చ. చులుకఁదనంబుఁ గోడిగముఁ జూపకు మోపవమాన మానినీ
తిలకములం గవుంగిటికిఁ దీసెద విట్టి విచార మాజడా
త్ముల దని పల్కగా డ్పలుకతో విరిఁబోండ్లయొడళ్లు వంపు దిం
ఫులుగొనరానిపెందెపులుఁ బూంచె; నిశాంతముఁ జెంది రింతులున్. 100

చ. తనయలవాతచేష్టఁ గని తత్ప్రతికార మొనర్పఁ జూళినం
దనుఁ డగు బ్రహ్మదత్తునకుఁ దండ్రి యొసంగినఁ గన్యకామణుల్
నునుజిగిసానదేఱిన మనోజులకోరుల మించి రద్దిరా!
మునిసుతుఁ జెట్టవట్టుశుభమూర్తుల కెక్కడిగాలిసోఁకుడుల్. 101

మ. కుశనాభుం డల సౌమదేయున కనుంగుంగూఁతులం బెండ్లి స
ల్పి శుభౌన్నత్యముఁ గన్నపిమ్మట జగత్ప్రేంఖోలికావర్తికీ
ర్తిశరచ్చంద్రసుధాపయోధి యగుగాధిం గాంచె నస్మద్గురుం
గుశసంజ్ఞుం డగుమత్పితామహుకృపం గోదండవిద్యానిధిన్.[1] 102

గీ. అనుచు నిజవంశకథఁ దెల్పు నతనియుక్తి
రక్తిగనుచాయఁ గెంజాయ ప్రాచిడాయ
దినముఖవిధేయములు దీర్చి మనుకులీనుఁ
డనుజుఁడును దాను మునివెంట నవల గదలి. 103

సీ. భవఫాలదృగ్వృతప్రవహత్తదీయకిరీటకోటిసుధాంశురేఖ యనఁగ
శైలాధిపాలానమూలకీలితసింధుగజరాజరజతశృంఖల యనంగ
నపవర్గమార్గసౌధారోహణాధారహీరమయాధిరోహిణి యనంగ
నతివేలసుకృతపక్షాహూతిహేతుశారదవారివాహధోరణి యనంగఁ
గీ. గమలకువలయకహ్లారకుముదసాధు, సీధుమాధుర్యమేదురక్షీరయై భ
గీరథునిపాలి సౌరశృంగిణి యనంగ, మించు గంగాతరంగిణిఁ గాంచె నెదుట. 104

శా. హస్తాంభోదనిరస్తయాచనకధారాటచ్ఛటాదైన్యసా
ధ్వస్తిక్షీరగవీవదాన్యదినరాజామ్నాయమూర్ధన్య వి

  1. ఇందలి వ్రాతతప్పులు సంస్కృతరామాయణచంపువు ననుసరించి సవరింపఁబడినవి.