పుట:Chanpuramayanam018866mbp.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము. 7

ర్ధను దిరువేంగళార్యకవిరాజసమాశ్రయధన్యచి త్తవ
ర్తను దయఁ బిల్వఁబంపి సముదంచితచాతురిఁ బల్కె నీగతిన్. 30

సీ. చక్రవాళాంకప్రశస్తివిస్ఫురణంబు సాళ్వతిమ్మనృపాలుసమ్ముఖమునఁ
గొలఁకులాయపుఁ దేజిబలురౌ తనినకీర్తి వీర వేంకటరాయశౌరిసభను
జంఘాలవాతూలచతురలాంఛనరూఢి వెలుగోటి వేంకటవిభునిచెంతఁ
బాకశాసనచిహ్నభాసురప్రభ చెంజివరదేంద్రునాస్థానవసుధయందు
గీ. మంతు కెక్కంగ నేమతిమంతుఁ డమరు, నతఁడు సామాన్యుఁడే సమస్తావనీమ
నీషిగణనీయమధురవాణీవిలాస, హసితభారవి తిరువేంగళార్యసుకవి. 31

ఉ. అత్తిరువేంగళార్యునియుదారదయావిలసత్కటాక్షసం
పత్తి నుదీర్ణమైనసుకుమారవచఃప్రతిభానిరూఢి ను
ద్యత్తరగద్యపద్యచయ మాశుగతి న్రచియింప నేర్చి నీ
విత్తఱి మంతు కెక్కితి మహీశులచెంగట వేంకటాచలా! 32

సీ. సందర్భములు లేవె జనసన్నుతానన్యపదసహిష్ణుతకుఁ జొప్పడవు గాక
కావ్యరీతులు లేవె కమనీయజాలివార్తావిశేషస్ఫూర్తి దగవు గాక
యుత్తరోక్తులు లేవె యుచితాదిమప్రౌఢకవిసుప్రయోగముల్ గావు గాక
సౌజన్యములు లేవె సకలార్థనికరోపకారసామర్థ్యంబు గనవు గాక
గీ. సమధికాచారభూసురోత్తములు లేరె, జగతి నీరీతి గౌరీశచరణభజన
ధీరనిష్టాగరిష్టులు గారు గాక, సకలగుణసాంద్ర వేంకటాచలకవీంద్ర! 33

చ. తరణిసమప్రతాపనిధి దామరయక్కనృపాలుసన్నిధిన్
వరకవిగంధసింధురము వచ్చె నటంచు వచించువాని క్రొ
వ్వగఁ గవిరాజకేసరి నటంచుఁ బఠించితి వాశువైఖరిన్
సరసులు మెచ్చ వాఙ్ముఖవిశంకట వేంకటశైలసత్కవీ! 34

ఉ. అంబుజసంభవోపమసమగ్రమనీష! నిరస్తదోషమై
యిం బడరంగ నీవు రచియింపఁ దొడంగినభవ్యకావ్యర
త్నంబు మదంకితంబుగ నొనర్పు మనల్పయశోవిభానుభా
వం బిల నానిశాకరదివాకరతారకమై విరాజిలన్. 35

వ. అని సబహుమానంబుగా నుదారఘనసారతాంబూలజాంబూనదాంబరాభరణాదు లొసంగినం గైకొని యత్యంతసంతోషతరంగితాంతరంగుండనై కృతిముఖంబున కలంకారంబుగాఁ గృతిపతివంశావతారం బభివర్ణించెద. 36