పుట:Chanpuramayanam018866mbp.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కులరేవంత! గజపతిసప్తాంగహరణబిరుదభాస్వంత! శచీకాంతదిశాక్పశోదరీము ఖదరీదృశ్యమాన కాశీరతిలకాయమాన వాసరాధీశతరుణకిరణప్రసారవికస దర విందమకరందబిందు మధురిమధురీణ నిరవద్యహృద్య గద్యపద్య భాసురమహా భారతభాగవతరామాయణాది పుణ్యకథానిరంతరావధారణలగద్భగవద మలగుణశంకాసమంకురనిదాన విశదాష్టమౌక్తికీవిశిష్టకర్ణ శష్కులీయుగళపర్యంతవిశ్రా స్తవిశాలనయన తామరసమందిరనందదిందిరాచరణలాక్షారస ప్రేక్షావహతరంగితాపాంగశోణ రేఖామయూఖసంచారధౌరేయకృపాకటాక్షరక్షిత సంస్కృతాంధ్రకవిరాయ కురుకు కురు కాశ కరూశ కోసల కళింగ బంగాళ చోళ గౌళ మాళవ మగధ మద్ర మళయాళ దహళ పాండ్య పొంచాల పల్లవ నేపాల ముఖ్యభూపాలశేఖరాస్థానప్రసిద్ధ పాఠకపటలపాపఠ్యమానమానితాత్మీయ బిరుదావళి ప్రహేళికా రగడ భోగావళీ దండక శతక తారావళీ చతుర్బద్రి కోదాహరణ చక్రవాళాది చాటుప్రబంధబంధుర లతాంతకంతుకనితాంతకవితాశాంతసౌరభ! కావేరీవల్లభ! యిబ్బరాత్యబబ్బరబాహ! ధరణీవగాహ! పంచఘంటానాదమేదినీమీసరగండ! మోహనమురారి ! సౌహత్తమల్ల! చాణూరమల్ల! చాళుక్యనారాయణాంక! నిశ్శంకదుర్గాధినాథ! కళ్యాణపురవరాధీశ్వర కటారిసాళ్వమాకరాజవీర రాఘవరాజతనూజ తిర్వెంగళనాథరాజకులపాలికాతిలక దేవళాంబాగర్భశుక్తిముక్తాఫలబొమ్మభూపాల సాధ్వీలలామరాగమాంబాచిరంతన సుకృతపరిపాక శ్రీస్వరూప చిన్నకృష్ణాజిమామనోహర! బాసదప్పవరగండాంక భాస్వరవీరానేక పనీకాశ ప్రచండగండక్షరద్దానధారాసముద్దండ వేదండప్రకాండోపరిసమారోపిత బిరుదకేతనశిఖానిర్ఘాతజీమూతసముదయాదభ్రగర్భ నిర్గళదనర్గళి విమలకరకానికాయ మాయావిలసదాత్మీయ విజయప్రయాణ వీక్షణక్షణోత్సుకఋభుక్షపురచకోరేక్షణాగణవికీర్యమాణ రారాజదాచారలాజాసంభార! కటకపురిచూరకార! శ్రీవేంకటాద్రిపతివందన! కావేరిరాజవరనందన! సల్లలితరసవిరాజగీర్ధన్య! వెల్లంటికసవరాజమూర్ధన్య ! విజయీభవ! దిగ్విజయీభవ! 28

వ. అని యనితరసాధారణానవద్యపదహృద్యనిజబిరుదగద్యపఠనపరిశీలిత పారీషద్యశ్రవణానందు లగువందిజనులకు నభీష్టవస్తువు లొసంగి యంత. 29

చ. నను హరిణాంకమౌళికరుణాసముపాత్తరసప్రసాదవ .
ద్ఘనతరసంస్కృతాంధ్రకవితాధను నాదిమవేదివంశవ