పుట:Chanpuramayanam018866mbp.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది




సీ. శబ్దతర్కాదిశాస్త్రప్రసంగములఁ బే రెక్కిన విద్యాంసు లొక్కవంకఁ
బ్రాకృతమాగధప్రముఖభాషలఁ గబ్బ మొనరించుకవిరాజు లొక్క వంక
రామభారతకథాప్రస్తావపటిమఁ జెన్నొందుపౌరాణికు లొక్కవంక
గీతప్రబంధాతిచాతురీవిస్పూర్తి నొఱపుమీఱినగాణ లొక్కవంక
గీ. నుచితమతిమంతు లగుమంత్రు లొక్కవంక
మఱియు సామంతబంధుసమాజవంది
యోధదండాధిపతిముఖ్యు లొక్కవంకఁ
బ్రమదమునఁ గొల్వ నిండోలగమున నుండి. 26

ఉ. వందిధురీణుల న్మధురవాణులఁ గన్లొని వేంకటాచలా
ర్యేందునిగుంభితం బగుసుధీడితమద్బిరుదాంకగద్య మా
నందవదాన్య మిత్తఱి వినన్వలె నావుడు వారు నింపుసొం
పొందఁ బఠించి రీగతి ననూనఘనస్వననిర్భరార్భటిన్. 27

బిరుదుగద్యము.— జయజయారంభజృంభమాణ గంభీరభేరీనినాదమేదురామోద కల్వాదశిలితాలయానుసారిభూరి నటనావలోకనారచితఖచరపుర చకోరలోచనాని చయ చారుహసితచంద్రచంద్రికానికర ముకుళితామందమందాకినీకనకారవింద సందోహసద్యోవికాసకారణ సముద్యోతమానప్రతాపమార్తాండ! ఐవరగండ! సంభోగభోగసాహస్రమండీతకుండలి కులాఖండలధరణీమండల భరణపాండిత్యగరి మసాహాయ్యవితరణప్రవీణ బాహాగ్రజాగ్రత్కృపాణకంఠీరవ కుమారలుంఠితా కుంఠ పరిపంథివసుంధరారమణగంధశుండాల! గండరబాల! చతుస్సముద్రముద్రితాఖండి భూమండలసభాగ్రవిభాసమాన విశంకటపాదపటలశంకు ప్రకాండహిండితానూనసానుమాణిక్యరశ్మి సంభారవిజృంభితశాతకుంభకుంభినీధర స్తంభశిఖరసానట్యమానమాననీయకీర్తి నర్తకీకరాంబుజాదభ్రవిభ్రమభ్రామ్యమాణధాౌత భాజనయుగవిరాజమానరజనికరహరిత్తుంగ! లోభిరాజకుమారవేశ్యాభుజంగ! విలాసవతీవితానవిలోచనచకోరికానికర రాకాసుధాకరశ్రీకరాకారకామనీయక విశేషనిర్జిత నిర్జరసేనాధినాథ నవనిధానాధీశనందన పురందరకుమార విక్రమవసంతకంతుసౌందర్య! దేవబ్రాహణ ప్రతిష్టాపనాచార్య! దుర్వారవేగలీలాపరాభూతజాత మన్యవతురగమణిరోచమాన దేవమణిరోచమాన తత్తాదృశావర్తకీర్తనీయ ఝంపాఛుడాఝళిపిఖురళిభంజళిగతి చతురసింధుగాంధారకాంభోజసంభవ సమంచిత పంచభద్రప్రముఖసైంధవధురంధర సమారోహనైపుణసపత్నీకృతన