పుట:Chandrika-Parinayamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇది స్వయంవరమునకు వచ్చిన రాజులను వర్ణించు సందర్భమునందలి ప్లక్షద్వీపాధిపతి వర్ణనము. ఓ చంద్రికా! ఈరాజుకీర్తిప్రకరము కల్పతరుకాంతితో నేకీభవించిన కాంతి గలదై మించి యుండఁగా, శుక్లపక్షమందుండు చంద్రుని తేజము హెచ్చగునా? అని సామాన్యముగాఁ బద్యభావము. అద్వైతసిద్ధాంతపరులైన విద్వాంసులచేతఁ బ్రశంసింపఁబడుచున్న ‘వేదాంతకల్పతరు’గ్రంథ పఠనమననాదులచే నుదయించిన వాసనాబలముచేత బ్రహ్మాత్మైక్యానుసంధానము గల విద్వాంసుఁ డతిశయకీర్తిమంతుఁడై యుండఁగా, పూర్వపక్షమతము నవలంబించిన మాధ్వమత వేదాంతసిద్ధాంతము హెచ్చజాలదని వ్యంగ్యార్థము. పూర్వపక్ష మనఁగా అపసిద్ధాంతము, శుక్లపక్షము నని యర్థద్వయము. ‘కీర్తిప్రకర’శబ్దములోని ప్రకరశబ్దము పుంలిగమగుటచేత నొక పురుషుఁడని వ్యంగ్యార్థము. ధ్వాంతపరధామంబు=మధ్వమతసిద్ధాంత మని యర్థము. ‘ధ్వ అంతే యస్య సః ధ్వాంతః’ అను విగ్రహవాక్యముచేత ‘ధ్వ’యను నక్షరము చివరగలది ‘మాధ్వ’శబ్ద మగును. తద్వాచ్యులు మాధ్వులు, అనఁగా ద్వైతమతస్థు లని యర్థము. ఈపద్య మీక్రింది వసుచరిత్రలోని చంద్రదూషణపద్యమును బోలియున్నది.

ఉ॥ ఇంతుల నేచుపాతక మదింతట నంతటఁ బోదు పాంథలో
కాంతక!నిన్ను ఘోరతమమై, ఘనమై, యజహత్కళంకమై
వంతలఁ బెట్టి యాఱుపది వ్రక్కలు సేయక, పూర్వపక్షపుం
గంతుల కేమి? చూచెదవుగా తుది నీ బహుళార్తిఖేదముల్.

ఈకవి స్వయంవరమునందు నాయికయగు చంద్రిక, నాయకుఁడగు సుచంద్రుని కంఠమున వైచిన స్వయంవరమాలను విశేషముగా నేడు పద్యములలో వర్ణించెను. (పంచమాశ్వాసము, 130, 131, 132, 133, 134, 135, 136 పద్యములు). సుచంద్రుఁడు చంద్రికచే వరింపఁబడుట పార్వతీదేవి ప్రమథగణసాన్నిధ్యమున దక్షిణామూర్తిని వరించినట్లుండెనట. ఆవరమాల సౌగంధ్యమునకై వ్రాలిన తుమ్మెదలు, పూర్వము సుచంద్రుని విరహకాలమున మలినాత్మతో బాధించిన యపరాధమును క్షమింపుమని సుమార్పణముఁ జేసి ప్రార్థించుచున్నట్లుండెనట. చంద్రిక సుచంద్రుని వక్షస్థలమందుంచిన సుమనస్సరవల్లరి, యతని దేహకాంతిచే నెఱ్ఱనయి చంద్రికాకటాక్షజలపుంజములు