పుట:Chandrika-Parinayamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే. జెక్కుఁగవ ముత్తియపుటొంట్లజిగి వెలుంగఁ,
బలుకుఁగప్రంపువీడెంబు వలపు నిగుడ,
నలరువేడుక వెనువెంటఁ జెలులు నడవ,
వేడ్కఁ జరియింతు రనిశంబు విటులు వీట.

ఇది యానాటి శృంగారపురుషుల వేషము. సరిగరుమాల=జరీయంచుతో నుండి తలకుఁజుట్టుకొను రుమాల. సుళువుఁ జెందిరకావి వలిపముల్=లేఁత చంద్రకావిరంగుగల యుత్తరీయములు. చిల్కతాళులు=తావళములుగా నున్న హారములు. ముత్తియపుటొంట్లు=ముత్యాల చెవులపోగులు.

సీ. కట్టెండ వెడఁదకాఁకఁ గఱంగి ప్రవహించు
జవ్వాదిడిగ్గియ చాలలోయఁ
బడుచు జొక్కపుఁ గ్రొత్తపటికంపుఁజఱిపజ్జ
బాగైన కెంపురాపణుకువాలు
పొదరుఁ బొన్నలరాలు పుప్పొడియిసుముపైఁ
బగిలి యొప్పెడు వేరుపనసపంటి
నీటికాల్వలఁ బ్రోచి పాటించు జేజేల
మ్రాఁకుతీవలఁ జుట్టిరాఁగ నలరు

తే. దాకపందిలి క్రింద, నిద్దంపువేడ్క
దవిలి, కోలాటమాడు గంధర్వసతుల
చారుసౌవర్ణకటకసింజానినాద
కుల ఘుమఘుమాయమానమౌ కోనఁ గనియె.

నాయకుఁడగు సుచంద్రుఁడు ఎండకాఁకచేఁ గఱంగి ప్రహించుచున్న జవ్వాదిచేత నేర్పడిన యొకదిగుడుబావిని, దానిప్రక్కన స్ఫటికపుదరిపై కెంపులసందులనుండి పుట్టుకవచ్చిన పొన్నచెట్లనుండి రాలిన పుప్పొడియిసుకను, దానిపైఁ బగిలిన పనసపండ్ల రసము కాల్వలుగాఁ బాఱుచుండ వాటి ప్రక్కనున్న కల్పలతలఁ జుట్టఁబడిన ద్రాక్షపందిరి క్రింద, దానిచేత నుత్సాహముతోఁ గోలాటమాడుచున్న గంధర్వయువతుల కాళ్లయందెల చప్పుడుచేతఁ బ్రతిధ్వనించుచున్న హేమకూటపర్వతమునందలి యొక