పుట:Chandrika-Parinayamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“సరసత్వంబునఁ గేలనూని యలయోషామౌళి చక్కన్ ‘రిరి
మ్మరిగామారి’ యటంచు, ‘రిప్పనిమగా మమ్మారి’ యంచు న్విభా
స్వర నానా నవరక్తి ‘దానతతి’ మించన్ ‘గౌళ’ వాయించి, ని
బ్బరపున్ వేడుకఁజేయు పంతువిధముల్ పల్కించె నప్పట్టునన్.”

(ఆశ్వా ద్వి. ప.96)

శృంగారోద్దీపకమగు ‘గౌళ’ రాగమునందు తానమును వాయించి, ‘పంతువరాళి’ రాగమునఁ గీర్తనలు వాయించె నని శాస్త్రీయముగాఁ జెప్పెను. ఆపై నాచిత్రరేఖ యిట్లు నాట్యము చేసెనట:

బళిరే! మైసిరితీరు, నిల్కడలు సేబా!సయ్యరే! పేరణీ
కలనం, బౌర! పదాళికాభినయవైఖర్యంబు, మజ్జారె! కో
పులవైచిత్రి, యహో! వినిర్మలకరాంభోజాతవిన్యాస, మం
చలివేణుల్ వినుతింప సల్పె నటనం బాకొమ్మ తత్సన్నిధిన్.

(ద్వి.97)

నాట్యముచేయుటలోగల మెలకువలను, పేరణి మొదలగు నృత్యములను జెప్పి తనభరతనాట్యశాస్త్రపరిచయమును దెలిపెను.

వివిధవర్ణనలు

సీ. సేసకొప్పుల నమర్చిన మొల్లమొగడచాల్
సరిగరుమాలపైఁ జక్కఁ దోఁప,
వలెవాటు వైచిన సుళువుఁజెందిరకావి
వలిపముల్ పదపల్లవముల జీర,
నెలవంకరేఖలు నెలకొన్న పేరుర
ములఁ జిల్కతాళులు తళుకుసూపఁ,
జెలువంబు నెగడఁ దీర్చిన క్రొత్తకస్తూరి
పట్టెల మేల్తావి మట్టుమీఱఁ,