పుట:Chandrika-Parinayamu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సందర్భము రెండు పద్యములకును మధుమాసవాసరవర్ణనమే. అట్లే కూతురు అత్తవారింటికి వెళ్లునప్పుడు చంద్రికతండ్రియు, గిరికతండ్రియు నోదార్చి పలికిన పలుకులలో సామ్య మీక్రిందివిధముగా నున్నది.

క॥ నిచ్చలు పుట్టినయింటికిఁ
జొచ్చినయింటికి నపూర్వశుభకీర్తితతుల్
హెచ్చ మెలంగవె తల్లి! భ
వచ్చరితము భువనపుణ్యవైఖరిఁ బొదలన్.

(చంద్రికాపరిణయము ఆశ్వా. 6.పద్య 98)



క॥ నీతమ్ముల శుభవాసన
నీతలిదండ్రుల గభీరనిశ్చలగుణ వి
ఖ్యాతియును దలఁచి మెలగుము
నాతల్లీ! కులవధూజనమత్తలికవై.

(వసుచరిత్ర ఆశ్వా. 6 ప.55)



సీ॥ నిజకటకాశ్రిత ద్విజపోషణమున నెవ్వని సార్వభౌమత ఘనతఁ గాంచుఁ
బర మహహీన సద్బల విభేదనలీల రమణ నెవ్వని నరేంద్రత్వ మలరు
గంధాంక కైరవకాండ లుంటాక ధామమున నెవ్వని యినత్వము సెలంగు
జాగ్రద్ఘనాఘన సాంద్రమదాపహశక్తి నెవ్వని మహేశ్వరత వొసఁగు
తే॥ నతఁడు వొగడొందు, జయశాలి, యహితసాల
కీలి, యతిదీప్తినిర్ధూత హేళి, యమర
విసర సన్నుత నయకేళి, యసమ సుగుణ
విజిత భువనాళి, శ్రీసింగవీరమౌళి.

(చంద్రికాపరిణయము ఆ1.ప20)



సీ॥ వసుమతీభార ధూర్వహత నెవ్వని యుర్వరావరాహాంక మర్థము వహించుఁ
గరగతచక్ర విక్రమశక్తి నెవ్వాని రామానుజత్వంబు రమణకెక్కు
జీర్ణకర్ణాటలక్ష్మీ పునస్సృష్టి నెవ్వాని లోకేశ్వరత్వము పొసంగుఁ
జటులశార్వరమగ్న సర్వవర్ణోద్ధారపటిమ నెవ్వని రాజభావ మెసఁగు