పుట:Chandrika-Parinayamu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలికలు
సీ॥ సుమనోగ సమచూత సుమనోగణపరీత
సుమనోగణిత సారశోభితాళి
కలనాద సంతాన కలనాదసమనూన
కలనా దలితమాన బలవియోగి
లతికాంతరిత రాగలతికాంత సపరాగ
లతికాంత పరియోగ లక్ష్యకాళి
కమలాలయాస్తోక కమలాలయదనేక
కమలా లసిత పాక కలితకోకి
తే॥ జాలక వితానక వితానపాళిభూత
చారు హరిజాత హరిజాత తోరణోల్ల
సద్వ్రతతికా వ్రతతిగావ్రజ క్షయాతి
భాసురము పొల్చె వాసంతవాసరంబు.

(చంద్రికాపరిణయము ఆ4ప.25)



సీ॥ లలనాజనాపాంగ వలనా వసదనంగ తులనాభికాభంగ దోఃప్రసంగ,
మలసానిల విలోల దళసాసవ రసాలఫల సాదర శుకాలపనవిశాల,
మళినీ గరుదనీక మలినీకృతధునీ కమలినీసుఖిత కోకకులవధూక,
మతికాంత సలతాంత లతికాంతర నితాంత రతికాంతరణ తాంత సుతనుకాంత,
తే॥ మకృతకామోదకురవకావికల వకుల
ముకుల సకలవనాంతప్రమోదచలిత
కలిత కలకంఠకుల కంఠకాకలీ వి
భాసురము వొల్చు మధుమాస వాసరంబు.

(వసుచరిత్రము)