పుట:Chandrika-Parinayamu.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తే॥ నతఁడు ‘వీరప్రతాప, రాజాధిరాజ,
రాజపరమేశ్వ, రాష్టదిగ్రాజకుల మ
నోభయంకర’ బిరుద సన్నుత జయాభి
రామగుణహారి, తిరుమలరాయశౌరి.

(వసుచరిత్ర ఆశ్వా. 1 ప.13)


 
సీ॥ తన కలావిభవంబు తన కలావిభవంబు కరణి సుదృగ్జాతి వఱలఁజేయఁ,
దన దానమహిమంబు తన దానమహిమంబుగతిని బ్రత్యర్థిసంఘములఁ బెంపఁ,
దన సుమనోవృత్తి తన సుమనోవృత్తిలీల సదాసవహేలఁ గూర్పఁ,
దన మహామిత్రాళి తన మహామిత్రాళి పగిది నానావనీభరణ మూనఁ,

తే॥ దనరు విషమాద్రి జిహ్మగ స్తబ్ధరోమ
మత్తమాతంగ కఠినకూర్మప్రసంగ
విరసవసుధావధూ భోగపర విహార
శాలి భుజకేళి మల్లభూపాలమౌళి.

(చంద్రికాపరిణయము ఆ. 1 ప.29)



సీ॥ తన భవ్యధామంబు తన భవ్యధామంబు కరణి మిత్రోన్మేషకరము గాఁగఁ,
దన ధర్మగుణములు దన ధర్మగుణముల ట్లతులిత శ్రుతిమార్గగతుల నెసఁగఁ,
దన మహాహవదీక్ష దన మహాహవదీక్ష పగిది నానావనీపకులఁ బెంపఁ,
దన యంబకంబులు దన యంబకంబుల లట్ల పరభీరువిముఖతఁ బరిఢవిల్ల,