పుట:Chandragupta-Chakravarti.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

చంద్రగుప్త చక్రవర్తి

గ్రామము లుత్తమ మధ్యమాధమ భేదములచే మూఁడు విధములు. ఈ విభాగము గాక యీ క్రింది విధముగ వేరు తరగతు లేర్పడుచుండెను.

(1) ఇనాము గ్రామములు

(2) సైనిక గ్రామములు

(3) ధన ధాన్యవస్తువులఁ జెల్లించు గ్రామములు

(4) పశువులను సేవకులను అమర్చు గ్రామములు

(5) పాలను పెరుగును కూరగాయలను ఇచ్చు గ్రామములు. .

రాజ్యాదాయ మార్గములు

ఇప్పటింబలె చంద్రగుప్తుని కాలంబునను రాజునకు మనదేశమున వరుంబడికి ముఖ్యాధారము నేల పన్నే యయి యుండెను. " సేద్యము క్రిందనుండు భూమిలో విశేషభాగమునకు నీటివసతి కలదు. సంవత్సరమునకు రెండు కారులు పంటలు పండును ... నదులమీద కొందఱు అధికారు లుందురు. వారు ఈజిప్టుదేశము నందువలె భూములుకొలిచి రైతుల కన్యాయము జరుగకుండుటకయి పెద్ద కాలువలనుండి పిల్లకాలువలకు నీళ్లు విడుచు ద్వారములను తగువిధమున మూయించుచు దెరిపించుచు నుందురు.” 1[1] సాధ్యమయినవఱకు ఇట్టి నీటి వసతుల నమర్చి చంద్రగుప్తుడు భూములయందు కర్షకులు చేయవలసిన కష్టమును అనుసరించి కరము గ్రహించుచుండెను, “ హస్త

  1. 1. మెగస్తనీసు