పుట:Chandragupta-Chakravarti.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13]

ఎనిమిదవ ప్రకరణము

97


పక్ష్యాదుల యొక్కయు లెక్క ఈతఁడు వ్రాయుచుండెను. అదే లెక్కలలో ఒక్కొక యింటివారు ప్రభుత్వము వారికి చెల్లించు చుండిన శిస్తుశుల్కముల మొత్తమును తేల్చుచుండును. గ్రామస్థుల వృత్తులను బేర్కొని వారువారు గడించు మొత్తములను రమారమిగ నిర్ణయించి లెక్క వ్రాయుటయు నతని పనులలో నొక్కటి.1 [1] ఈ కర్తవ్యములను బట్టి ఇతఁడు అప్పటి కరణమని వేరుగ వ్రాయఁబనిలేదు.

ఎనిమిదివందల గ్రామములపై యధికారికి స్థానికుఁడని పేరు. ఈ 800 గ్రామముల సంరక్షణార్ధము స్థానీయమనఁబడు దుర్గమొండుండెడిది. ప్రస్తుతపు జమిందారీలలోని ఠాణేదారు శబ్దమునకు ఈస్థానికుఁడు అనుపదము తండ్రియేమో. గోపుఁడు గ్రామముపైఁ బలెస్థానికుఁడు మండలముపై అధికారి. ఈయధికారులందఱ పై వాఁడు 'సమాహర్త' నాఁబరుగుచుండెను. రాష్ట్రమును మండలములుగ విభజించుటయు, గ్రామముల తరగతులను నియమించుటయు, గ్రామాధికారులయొక్కయు స్థానికుల యొక్కయు పనులను బరిశీలించుటయు నీతనికిఁ గర్తవ్యములు. ఈ సమాహర్తగాక రాజ్యాంగశాఖ లొక్కొంక్కింటికిని నొక యధ్యక్షుఁ డుండును. అధ్యక్షు లందఱును మంత్రులలోని వారె. వీరు రాజుతోడంగూడ పైన నుడివినట్లు రాజ్యభారమును వహింతురు.

  1. 1. చాణక్యుని అర్థశాస్త్రము.