పుట:Chandragupta-Chakravarti.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

99


ప్రవర్తిమ' ఆ భూములయందు అనఁగా చేతి కష్టముచేత నీటి పాఱుదలయగు భూములయందు “ఉదక భాగము" 1[1] పంటలో నైదవవంతుగ నిర్ణయింపఁబడి యుండెను. "స్కంధ ప్రవర్తిమ" 2[2] భూములలో ననఁగా ఎడ్ల సాహాయ్యమున నీరు పాఱుదల చేసి కొను భూములలో నాల్గవ వంతుగను; 'స్రోతయంత్ర ప్రవర్తిమ' భూములలో ననఁగా వాయుయంత్రముల 3[3] మూలమునను ఇతర యంత్రముల మూలమునను సాగగు వానిలో మూఁడవ వంతుగను నదులు, సరస్సులు, చెఱువులు, బావులు మున్నగువాని క్రింది పంటలలో, మూఁడవ లేక నాల్గవ వంతుగను పన్ను నిర్ణయింపఁబడి యుండెను.

అర్థశాస్త్రమున నొక్కెడ " సాగుచేయక వదిలిపెట్టఁ బడిన భూములను (రాజు) పంటలో సగము భాగమునకు పైరు పెట్టువారికి ఇయ్యవచ్చును. స్వంత సేద్యముగల రైతులకు నాల్గవ వంతునకో, యైదవ వంతునకో, యిచ్చి వేయవచ్చును.

  1. 1. నీటి తీరువయని యర్థము.
  2. 2. "స్కంధప్రవర్తిమ" మనుదానికి "భుజముచేత మోసికొనుట" యని కొందఱర్థము వ్రాసి యున్నారు. ఆ యర్థ మంగీకరించినచో హస్తప్రవర్తిమమునకును దీనికిని భేదమెట్లో తెలియరాకున్నది. భేదము లేనిచో తీరువ ఎట్లు భేదపడునో నిర్ణయింపరాదు. స్కంధమను శబ్దము జత యెడ్లకుంగూడ ప్రవర్తించును గాన నెడ్ల సాయమున నీరు పాఱించుకొని సాగుబడి చేసికొనఁబడు భూములనుట యుక్తి యుక్తముగా నున్నది.
  3. 3. వాత ప్రవృత్తిమనందిని వన్ధాయతన తటాక కేదారా రామషణ్దవాపానాం సస్యపణ భౌగోత్తరిక మన్యేవ్యే వాయథోపకారందద్యు.. ( అర్థశాస్త్రము మూఁడవ భాగము.)