పుట:Chandragupta-Chakravarti.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

85


గను వర్తకులుగను గాలము గడుపుచుండిరి. తక్కుంగలవారు రాజు లనఁబడుచుండిరి. ప్రతిశ్రేణియు నొక్కనాయకునకు లోఁబడి ప్రవర్తించుచుండెను.

ఈ మూఁడు తెఱంగుల బలములు గాక ఆరణ్యకులును పార్వతేయులును సందర్భ వశంబున విశేష సైన్యాంగముగ నుపయోగించుకొనఁ బడుచుండిరి. జయింపఁబడినవారిని దోఁచుకొనుటయే. వీరిని వేతనము.

ఇట్లేర్పడిన కాల్బలంబులకు నాయకుండగువాఁడే సర్వ సైన్యంబులకును నధ్యక్షుండు.

ఆశ్విక సైన్యము

ఆశ్విక సైన్యమునఁ బ్రతి భటుఁడును రెండు ఈటెలును డాలును యుద్ధమునకు గొంపోవుచుండెను. ఈతని డాలు కాల్బలంబు డాలునకంటె కురుచగ నుండును. గుఱ్ఱముపై జీనులు వేయుట యాచారముగాదు. గుఱ్ఱములకుఁ గళ్లెము దగిలించుటయు లేదు. కాని గుండ్రముగ కుట్టబడిన ఎద్దుతోలు మూఁతతో వాని ముఖములు కప్పఁబడు చుండెను. ఆ మూఁతల లోభాగమున వాడియంతగ లేని ఇనుము, ఇత్తడి లేక దంతపు ముండ్లి ముడ్పఁబడి యుండుటచే నదియే కళ్లెమువలె నుపచరించుచుండెడిది. 1[1]

యుద్దమునకయి గుఱ్ఱములకు వల్గనలంఘనేత్యాద్యనేక గతి విశేషంబులు నేర్పఁబడుచుండె. యుద్ధభూములయందును

  1. 1. ఆర్టియ నను గ్రీకు లేఖకుఁడు.