పుట:Chandragupta-Chakravarti.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

చంద్రగుప్త చక్రవర్తి


అరణ్యములయందును మధ్యభాగమున నిల్చి మిగత సైన్యంబు. చేరుటకు గురియై యుండుటయు, సైన్యోపయోగమున కగు జంతువులు ప్రవాహములు దాఁటవలసి వచ్చినప్పుడును ఝంఝామారుతమున ప్రయాణము సలుపవలసి వచ్చినప్పుడును చెదరిపోకుందుటకయి వానికి కట్టఁబడిన పగ్గములఁ బట్టుకొనుటయు, తమ రస్తుసామగ్రిని కాపాడుకొనుటయు, శత్రువుల రస్తుసామగ్రిని గొల్లకొట్టుటయు, క్రొత్తఁగ తమ సాహాయ్యూర్థము వచ్చు దండులను సంరక్షించుకొనుటయు, శత్రువులకు సాయమువచ్చు దండుల చెదరగొట్టుటయు, తమ సైన్యమును సుశిక్షితముగఁ బెట్టుకొనుటయు, సమయమగుడు దానిని పొడువుగ గానవచ్చునట్లు దీర్చుటయు, సైన్యపార్శ్వాంగముల సంరక్షించు కొనుటయు, యుద్ధము ప్రారంభ మగునప్పుడు మొదట స్వారికి వెడలుటయు, శత్రుబలంబుల చెల్లా చెదరుచేసి నుఱుమాడుటయు, తమ బలంబుల నాకస్మికముగ వైరు లెదిర్చినచో నడ్డువడయుటయు, వారిం బట్టుటయు, వారు లోఁబడి శాంతిమై వెడలుచో వారిని వదలుటయు, తమ సైన్యంపు మార్గమును మరల్చుటయు, రాజులను ధనంబును మోసికొనిపోవుటయు, శత్రువుల వెన్నుదన్ని తాఁకుటయు, పారిపోవు రిఫులఁ దరుముటయు, జయించిన స్థానంబుల, పోగగుటయు నాశ్విక సైన్యంబుల కర్తవ్యంబులయి యుండె.

ఈ యాశ్విక సైన్యంబులకు నుత్తమాశ్వంబులు కాంభోజ సింధ్వారట్టవనాయు బాహ్లిక సౌవ్వీర పాపేయతైతల