పుట:Chandragupta-Chakravarti.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

చంద్రగుప్త చక్రవర్తి

ఈ ధనుర్ధరులుగాక పదాతిసైన్యంబున ఖడ్గధారులును గొంద ఱుందురు. వారికత్తులు పొడవును వెడల్పునునై ఇరుకు సందుల నగు యుద్ధముల మిక్కిలిగ నుపయోగింపఁబడు చుండెను. అట్టి సందర్భముల భటు లొక్కొకవేళ రెండు చేతులతోడను ఖడ్గముం జళిపించి వేయుచుందురు. 1[1]

చంద్రగుప్త చక్రవర్తి కడనుండు బలములు మూలబలంబులు, కృతబలంబులు, శ్రేణిబలంబులు, అని మూఁడు తెఱంగులుగ నుండెను. రాజుచే శాశ్వతముగ నిలుపుకొనఁబడి యుండిన సైన్యములు మూలబలంబులు. యుద్ధప్రసంగము వచ్చినప్పుడు సిద్ధపఱిచి . వేతనమొసంగి నిలుపుకొనఁబడినవి కృతబలంబులు. శ్రేణిబలంబులు అను పదమునకుఁ గొంచెము విపులమగు వ్యాఖ్యయవసరము. దేశమునం దచ్చటచ్చట క్షత్రియ వీరుల 'శ్రేణులు' అనఁగా సంఘములు నెలకొని యుండెను. వీరు వర్ణమునందు క్షత్రియులేయయ్యును రాజ్యాధికారము లేమింజేసి యుద్ధవిద్య నభ్యసించియు నితరవృత్తులచే జీవనము గడుపుకొనుచుండిరి. వీరి సాహాయ్యమును యుద్ధముల యందుఁ జక్రవర్తులు పొందుచుండిరి. వీరే శ్రేణులు. ఆ కాలమున నిట్టి శ్రేణులలోఁ బ్రసిద్ధమయినవి కాంభోజమునను, సౌరాష్ట్రమునను, లిక్షవియందును, వ్రిజకమునందును, మల్లకమునందును, మద్రక కుకురు కురు పాంచాలములయందును.2[2] నుండెను. అందు కాంభోజ సౌరాష్ట్రముల వారు కృషీవలులు

  1. 1. ఆర్టియను అను గ్రీకులేఖకుని వ్రాతల ననుసరించి
  2. 2. ఆర్థశాస్త్రము 11 వ భాగము 1 వ ప్రకరణము