పుట:Chandragupta-Chakravarti.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

83


శస్త్రములును, యంత్రములును, తైలములును ( Oils ) కాళ్లు చేతులు విరిగినవారికి కట్టులుగట్టుటకు వస్త్రములును మున్నగు వైద్యోపకరణంబులఁ గొని బలంబుల వెంబడి నేగుచుండిరి. గాయములువడిన యుద్ధభటులకు నుపచారములు సలిపి, పధ్య పానాదుల. నమర్చుటకయి తత్తదర్హ వస్తుసంచయంబులఁ గొనుచు ధాత్రికలు (దాదులు) ను వీరితోడం గూడనుందురు. ఇట్టి ధాత్రికలకు మార్గదర్శినియని యీ కాలమున లోకమునందంతట పేరుగాంచిన ఫ్లారెన్సు నైటింగేలుసతి. గత శతాబ్దము నందలిది. ఇట్టి ఫ్లారున్సు నైటింగేలులు చంద్రగుప్త చక్రవర్తి కాలమున నెందరో యుండిరి. అట్టివారిని నియమించుటయు రస్తుసామగ్రి పంచాయతివారి కర్తవ్యంబె. 1[1]

కాల్బలములు

చంద్రగుప్తుని కాలమునందలి పదాతులు ముఖ్యముగ ధనుర్దరులు. ప్రతిభటుఁడును దన పొడవునకు సమమగు పొడవు గలవింటిని మోయుచుండును. అవసరమగుడు దానిని భూమిపై మోపి గుణము సంధించి ఆకర్ణాంతముగఁ దిగిచి మూఁడు గజములఁ బాణంబులఁ బ్రయోగించు చుండును. ఈ బాణములకు డాళ్లుగాని కవచములుగాని మఱియెంత బలిష్ఠమయిన ఇతర రక్షలుకాని అడ్డుపడలేకుండెను. ఆ కాల్పంబులు తమ శరీరముల సంరక్షించుకొనుటకు పదునుచేయని తోళ్ళతోఁ జేయఁబడిన నిలువునతమ్మును బూర్ణముగ గప్పఁ గలుగు కేడెముల నెడమచేత ధరించుచుండిరి.

  1. 1. చాణక్యుని అర్థశాస్త్రము. 10 వ భాగము