పుట:Chandragupta-Chakravarti.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

చంద్రగుప్త చక్రవర్తి


కౌటిల్యుని అర్థశాస్త్రమును బట్టి చూడఁగా నా కాలమున 'నావాధ్యక్షుఁడ'ను అధికారి యుండినట్లును సముద్రముల మీఁదను సరస్సులమీఁదను దిరుగునట్టి యోడలను గుఱించిన యధికారమంతయు నాతని చేత నుండినట్లును గనుపించుచున్నది. రేవులయందు సుంకములు వసూలు చేయు పనిని గూడ నితఁడే తీర్చుచుండెను. నావికాచోరులను దండించుటయు గాలివానలచే నలంగిన యోడలకు శరణమిచ్చుటయు నీతని ధర్మముల లోనివయి యుండెను. గొప్పగొప్ప నదులను దాటుటకొరకై ప్రభుత్వము వా రేర్పఱిచిన నావలకును పడవలకును వానిపై నుండు నౌకరులకును నితఁడే యధికారి.

రస్తు సామగ్రి

రెండవ పంచాయతివారు రస్తుసామగ్రి మున్నగువానిని సమకూర్చువారని వ్రాసితిమి. యుద్ధమునకు సైన్యము బయలుదేరు తరి భోజనము సిద్ధపఱుచుటకుఁ గావలసిన ధాన్యాదులును, గట్టియలును, యుద్దమువ గాయపడు భటుల చికిత్సకొఱకగు మందులును ఉపకరణములును, గుఱ్ఱములకు నేనుంగులకు వలయు మాసాదులును, యుద్ధము సలుపునెడ నవసరమగు నాయుధాదులును వెంటపంపుటకే యీపంచాయితి యేర్పడినది. ఆకాలము నందు వైద్యశాస్త్రము భరతవర్షమున మిక్కిలి పెంపుగాంచి యుండెను. కాశీనగరంబునను తక్షశిలా నగరంబునను నెలకొల్పఁబడి యుండిన సర్వకళాభవనములు ప్రసిద్ధిఁ జెంది యుండె. అచ్చట విద్యగఱచిన వైద్యవిద్యా విశారదులు