పుట:Chandragupta-Chakravarti.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9]

ఆఱవ ప్రకరణము

65


వైభవమును, సంక్షిప్తముగఁ దరువాతి చరిత్రయు, నీ ప్రకరణమునందు వర్ణింపఁబడుట యత్యంతావశ్యకము.

నామనిర్దేశము

సాధారణముగా నిటీవలి యింగ్లీషుచరిత్ర గ్రంధములలో 'పాటలిపుత్ర' నామమే యెక్కుడుగా వ్యవహరింపఁబడు చున్నను, సంస్కృతకవులు మాత్రము పాటలీపుర, కుసుమపుర, పుష్పపుర నామములనే వాడి యున్నారు.*[1] త్రికాండ శేషమునందు మాత్రము 'పాటలీపుత్ర' మను పాఠాంతరము కలదు. బృహత్కథయందుఁ గూడ నీ పేరు వచ్చినట్లున్నది. గ్రీకుల భాషలో దీనిని పాలిబోతు (Palibothu ) అని వాడియున్నారు. ఈ పట్టణ స్థానమునందున్న పట్టణమునకు నిపుడు 'పొట్నా' యన్న పేరు కలదు.

ఇప్పుడీ పట్టణమెచ్చట నున్నది?

హిందూదేశ పటమును ఎదుట వేసికొని చూచినయెడల ఈశాన్య దిశయందు ఇప్పుడు ఈ దేశపు ముఖ్య రాజధానియగు కలకత్తాపురి కానవచ్చును. ఇప్పురి గంగానది పాయలో బెద్దదియగు హూగ్లినదీ తీరమున గంగాసాగరమునకు నలువది మైళ్ళ దూరమున అలరారుచున్నది. ఇచ్చటనుండి యోడమార్గమునో లేక పొగబండి మార్గమునో అనుసరించితిమేని రమారమి 333 మైళ్ళ దూరమున పాట్నా యను పట్టణము గంగాతీరమున

  1. * రఘువంశము, 6 వ సర్గము, 24 వ శ్లోకము, ఆర్యభట్టీయము, ద్వితీయ గణితపాదము.