పుట:Chandragupta-Chakravarti.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

చంద్రగుప్త చక్రవర్తి


కలకత్తాకు వాయవ్యమున నుండఁజూతుము. ఇయ్యది దిగువ బంగాళపు (Lower Bengal) పట్టణములలో కలకత్తాకు రెండవదిగా నున్నది. ఇంతటి విస్తీర్ణమును జనసంఖ్యయు నేటికిని గల యీ పాట్నాపురి మహమ్మదీయ పరిపాలనమున బేహారు జిల్లాకు ముఖ్యస్థానముగ నుండె. కాని ఈ నామముచే నొప్పుపురము 650 వత్సరములకు మున్నుండ లేదు. దీనిస్థానమున గొంతకాలము బీడును, అంతకుఁ బూర్వమున, ననఁగా ప్రాచీన కాలమునందు మఱియొక గొప్పపురియు నుండెడివి. ఆ వురియే పాటలీపురము.

రాజకీయ విషయమునందు గంగానదియొక్క విశేషము నరయుఁడు. గంగాశాఖ యగు హూగ్లీతీరమున హిందూదేశపు ప్రస్తుతపు రాజధాని కలకత్తా యున్నది. గంగ కుపనదియగు యమునాతీరమున మహమ్మదీయ రాజధానులగు దిల్లీ, యాగ్రాలు కలవు . దిల్లీకి మూడు మైళ్ళదూరమున పాండవ రాజధాని ఇంద్రప్రస్థ ముండె. ఇంద్ర ప్రస్థమునకు అఱువదిమైళ్లు వాయవ్యమున కౌరవపారిక్షితుల రాజధాని హస్తినాపురముండె. గంగ కుత్తరోప నదియగు సరయు (గాగ్రా) దక్షిణతీరమున అయోధ్యాపురి రఘుకుల రాజుల రాజధానిగనుండె గంగ, గాగ్రా, రాప్తి, గండకి, శోణానదులు కలియు ప్రాంతమున పాటలీపుత్రము చంద్రగుప్త రాజధానిగ నుండె. కావున రాఘవ, కౌరవ, పాండవ, పారిక్షిత, నంద, చంద్రగుప్త, గుప్త, ఆంధ్ర, మహమ్మదీయ, ఆంగ్ల రాజధానులు, గంగనో, గంగా