పుట:Chandragupta-Chakravarti.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ ప్రకరణము

చంద్రగుప్తుని రాజధాని

భరతఖండంబు నంతయు ఏక ఛత్రాధిపత్యము క్రిందికిఁదెచ్చిన మన కథానాయకుఁడు పాటలీపుత్రమను నగరమునందు రాజ్యము చేయుచుండెను. పుష్ప పురము, కుసుమ పురము అను నామాంతరములు గల యీ పట్టణరాజము చంద్రగుప్త చక్రవర్తి ప్రభుత్వ కాలమునందు మహోన్నతావస్థను చెంది, అతని మనుమఁడగు అశోకుని రాజ్య కాలమందు నత్యుచ్చవైభవ శిఖరముఁజేరి. భూలోకమునందు నా కాలమున నున్న యశేష పట్టణములలో నతి శ్రేష్ఠమైసదియు, నద్వితీయమైనదియు నని బొగడ్తఁగని యుండెను. ఇదియుఁగాక, యనేక కవులకును, పండితులకును, శిల్పులకును, అన్యదేశ వర్తకులకును, ఆశ్రయ స్థానమును, వర్లనీయవిషయమును అయి రాఘవుల అయోధ్యకును, కౌరవుల హస్తీనాపురమునకును, మోగలుల దిల్లీకిని, ఆంగ్లేయుల కలకత్తాకును సరిపోల్చఁదగిన యీ పుష్పపురి రమారమి వేయి సంవత్సరముల వఱకును మగధరాజధానియై విలసిల్లెను! ఇట్టి పుర శ్రేష్ఠము యొక్క యుత్పత్తియు, చంద్రగుప్తుని కాలమున నద్దాని