పుట:Chandragupta-Chakravarti.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రగుప్త చక్రవర్తి

మొదటి ప్రకరణము

మగధ రాజ్యము

మగధము ఆర్యావర్తంబునందు మిక్కిలి పురాతన కాలమునుండి ఖ్యాతివడసిన యొక మహారాజ్యము. ఈ రాజ్యము యొక్క వైశాల్యము వేరు వేరు యుగములయందు వేరు వేరు విధములుగ నుండినను మొత్తము మీఁద నీ దేశమునకు ఉత్తరమున గంగానదియు, దక్షిణమున వింధ్యగిరియు, పడమట శోణానదియుఁ, దూర్పున చంపాదేశమును నెల్లలుగా నుండెనని చెప్పవచ్చును. ఇప్పు డీ ప్రదేశమును దక్షిణబేహార్ అనియెదరు. బేహారనునది విహారశబ్ద భవనము. బౌద్ధయుగమునం దీ రాజ్యముయొక్క చుట్టుకొలత రెండువేల మూఁడువందల మైళ్లు. ఇందలి గ్రామములసంఖ్య యెనిమిది వేలు.

మగధదేశపు రాజధాని ప్రథమమున గిరివ్రజ మను దుర్గము. పిదప క్రమముగా రాజగృహము, వైశాలి, పాటలీపుత్రము అను పట్టణములు రాజధాను లయ్యెను. ఉత్తర ప్రాంతమందలి రాజ్యముల యభివృద్ధియే యిట్టి మార్పులకు