పుట:Chandragupta-Chakravarti.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

చంద్రగుప్త చక్రవర్తి


ముఖ్యకారణము. గిరివ్రజ మయిదుపర్వతముల నడుమ నిర్మింపఁబడిన యొక దుర్గము. రామాయణమునందు గిరివ్రజ మీలాగుననే వర్ణింపఁబడి యున్నది.*[1]

మహాభారతమునం దీపర్వతముల పేళ్లు వైహార, వరాహ, వృషభ, నృషిగిరి చైత్యకము లయినట్లు చెప్పఁబడియున్నది. ♦[2]ఇప్పు డీపర్వతములను జనులు వైభార, విపుల, రత్నోదయ, సోనగిరు లని వాడుకొనియెదరు. వైభార పర్వతము మీఁద జైనుల శాసనములు పెక్కులు గలవు. ఈ పర్వతము మీఁదనే క్రీ. పూ 543లో బౌద్ధుల యొక్క ప్రథమ పాంచవార్షిక సంఘము కూడియుండెను. గిరివ్రజము యొక్క చుట్టుకొలత నాలుగున్నర మైళ్లు. గిరివ్రజము కుశరాజు యొక్క కుమారుఁడగు వసురాజుచేఁ గట్టింపఁబడియె. కట్టిన శిల్పి పేరు మహాగోవిందుఁడు. గిరివ్రజపు రాతిగోడలకంటెఁ బురాతనమైన కట్టడము లెవ్వియు నార్యావర్తమునందుఁ గానరావు. గిరివ్రజమునే యిప్పటి జనులు పురాతన రాజగృహమని వాడెదరు.

రాజగృహ పట్టణము గిరివ్రజమున కుత్తరమున అర్థ క్రోశము దూరమున నిర్మింపఁబడియె. ఈపట్టణము బింబిసారుఁడను నృపపుంగవునిచేఁ గట్టింపఁబడియె. ఈతని కుమారుఁడగు ప్రజాతశత్రువు గౌతమ పుత్త్రునకు సమకాలికుఁడు. ప్రస్తుత మీ స్థలమందు రాజగిర్ అను జీర్ణదుర్గ మొకటి గలదు.

  1. *బాలకాండము 32 వ సర్గము.
  2. ♦సభాపర్వము 21 వ అధ్యాయము